Saturday, April 20, 2024
- Advertisement -

నేత‌ల‌కు ప‌రోక్ష సంకేతాలు పంపిన జ‌గ‌న్…. తీరు మార్చుకోక పోతే…?

- Advertisement -

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నిక‌లు పూర్యాయ్యాయి. 88సీట్లను టీఆర్ఎస్ పార్టీ సాధించి రెండో సారి సీఎంగా కేసీఆర్ ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. ఇప్పుడు త్వ‌ర‌లో ఏపీ ఎన్నిక‌లు రానున్నాయి. గెలుపే ధ్యేయంగా ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతూ వ్యూహాత్మ‌కంగా ముందుకెల్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో చేసిన త‌ప్పిదాలు ఈసారి పున‌రావృతం కాకుండా అడుగులు వేస్తున్నారు.

అన్ని నియోజ‌క వ‌ర్గాల్లో జ‌గ‌న్ స‌ర్వే చేయిస్తున్నారు. ఆ స‌ర్వే ఆధారంగా ఆయా నియోజకవర్గాల్లో ఇంచార్జ్ పరిస్థితి పెర్ఫార్మెన్స్ బాగోలేకపోతే వారిని నిర్మోహమాటంగా తప్పిస్తున్నారు వైఎస్ జగన్. తాజాగా పీకే స‌ర్వే కూడా జ‌గ‌న్ చేతికి చేరిన‌ట్లు స‌మాచారం.

పీకీ ఇచ్చి నివేదిక‌ను ఆయా ఇంచార్జ్‌ల జాత‌కాల‌ను వారికి ఇస్తూ జ‌గ‌న్ చ‌ర్చిస్తున్నారు. ఇంచార్జ్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ సామాజికవర్గంలో బలం పెంచుకోవాలో సూచించారు. అవసరమైన చర్యలు తీసుకోండి. మళ్లీ సర్వే నాటికి మార్పు రాకపోతే మేమే మార్చేస్తాం అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి నియోజకవర్గాల ఇంచార్జ్ లకు వార్నింగ్ ఇచ్చారట.

జగన్ చేయించిన సర్వేల నివేదిక ఆధారంగా నియోజకవర్గాల వారీ నివేదికలను రూపొందించి వాటిని పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు అందజేశారు జగన్. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలవారీ పార్టీ పరిస్థితి, నాయకుల స్థితిగతులతోపాటు ఆయా సామాజికవర్గాల వారీ పార్టీకి, ప్రత్యర్థి పక్షాలకు ఉన్న సానుకూలతను కూడా తెలియజేశారు.

అటు ప్రశాంత్ కిషోర్ టీంతోపాటు తన సొంత మీడియా సంస్థతోనూ, ప్రైవేట్ సంస్థలతోనూ సర్వే చేయించారు. ఈ మూడు నివేదికలను బేరీజు వేసుకుని నియోజకవర్గాల వారీగా నివేదికలు తయారు చేసి ఆయా ఇంచార్జ్ లకు అందజేశారు.

ఇకపోతే ఈ సర్వేలలో జగన్ మూడు అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. నియోజకవర్గాలలో వైసీపీ పరిస్థితి, అక్కడున్న పార్టీ ఎమ్మెల్యే లేదా సమన్వయకర్త పనితీరు, అధికార పార్టీ నాయకుడి పరిస్థితి ఉలా ఉంది అన్న అంశాలపై ప్రధానంగా సర్వే చేయించారు. వారి సొంత నియోజ‌క వ‌ర్గాల్లో వారికి ఎంత ప‌ట్టుఉంది, ప్ర‌జాబలం ఎంత ఉంది…ఎవరు ఓటర్లను ఆకర్షిస్తారు వంటి విషయాలపైనా జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. అందుకు తగ్గట్లుగా నియోజకవర్గాల్లో ఐదు సామాజికవర్గాలను ఎంపిక చేసుకుని వాటిలో వైసీపీ, టీడీపీ, జనసేన పరిస్థితి ఎలా ఉందన్న అంశాలను పసిగట్టారు. స‌ర్వే నివేదిక‌ల ఆధారంగానే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇస్తాన‌ని మొహ‌మాటం లేకుండా జ‌గ‌న్ చెప్పిన‌ట్లు స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -