Saturday, April 20, 2024
- Advertisement -

క‌డ‌ప జిల్లా వైసీపీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌…

- Advertisement -

ఎన్నిక‌ల స‌మయం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ జ‌గ‌న్ దూకుడు పెంచారు. ఈ ఎన్నిక‌ల‌ను జ‌గ‌న్ ఎంతో ప్ర‌తీష్టాత్మ‌కంగా తీసుకున్నారు. పాద‌యాత్ర ముగియ‌డంతో అభ్య‌ర్తుల ఎంపిక‌పై దృష్టి పెట్టారు. పాద‌యాత్ర‌లో అభ్య‌ర్తుల‌పై ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చిన జ‌గ‌న్ అధికార పార్టీ టీడీపీకి షాక్ ఇచ్చే నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. అభ్య‌ర్తుల ప్ర‌క‌ట‌న సొంత జిల్లా క‌డ‌ప‌నుంచే మొద‌లు పెట్టారు. తాజాగా రెండు నియోజ‌క వ‌ర్గాల‌కు అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించారు.

2014లో జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి గెలిచిన ఆదినార‌య‌ణ రెడ్డి టీడీపీలోకి ఫిరాయించి మంత్రి ప‌ద‌విలో కొన‌సాగుతున్నారు. అప్ప‌టినుంచి నియోజ‌క ఇన్‌ఛార్జ్‌గా సుధీర్‌రెడ్డి పార్టీ కార్య‌క్ర‌మాలు చూసుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆయనకే వైసీపీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశాడు జగన్. తాజాగా జమ్మలమడుగు పర్యటనలో భాగంగా ప్రజల ముందు జగన్ అభ్యర్థిత్వ ప్రకటన చేసి విప‌క్షాల‌కు షాక్ ఇచ్చారు.

జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్ తనకే అని గట్టిగా చెప్పుకున్న సుధీర్ రెడ్డికి ఆ అవకాశం ఖరారు అయ్యింది. సుధీర్ రెడ్డిది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే. మాజీ హోంమంత్రి, సీనియర్ పొలిటీషియన్ ఎంవీ మైసూరారెడ్డి తమ్ముడి కొడుకే సుధీర్ రెడ్డి. భుత్వ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేశాడు. మూడేళ్ల నుంచి జమ్మలమడుగు రాజకీయంలో యాక్టివ్ గా ఉన్నాడు.

అనుచరులతో కలిసి జమ్మలమడుగు ఇంచార్జీ సుధీర్ రెడ్డి జగన్‌ను కలిశారు. సుధీర్ రెడ్డికి ఈ దఫా టిక్కెట్టు ఇవ్వాలని ఆయన అనుచరులు జగన్‌ను కోరారు. మీకు ఇష్టమైతే సుధీర్ రెడ్డే మీ అభ్యర్థి అని జగన్ ప్రకటించారు. ప్రభావతితో పాటు ఆమె అనుచరులను జగన్ సముదాయించే ప్రయత్నం చేశారు. సుధీర్ రెడ్డిని గెలిపించుకొని వస్తే ప్రభుత్వం ఏర్పడితే ప్రభావతికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

మైదుకూరు నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని వైసీపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతారని జగన్ పార్టీ శ్రేణులకు తేల్చి చెప్పారు. రఘురామిరెడ్డి గతంలో టీడీపీ అభ్యర్ధిగా గెలిచారు. ఆ తర్వాత వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -