Friday, April 19, 2024
- Advertisement -

చంద్ర‌బాబు కుట్ర‌ల్ని చూస్తుంటే బాధ‌గా ఉంది: జ‌గ‌న్

- Advertisement -

రాబోయే ఎన్నిక‌ల్లో ఒక్క క‌డ‌ప‌లోనే కాదు, రాష్ట్రంలో సీఎం చంద్ర‌బాబుకు డిపాజిట్లు కూడా ద‌క్క‌వా..? కడపలో గెలవరని తెలిసి చంద్రబాబే, జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్.వివేకానంద‌రెడ్డిని హ‌తామార్చారా..? వివేకాను హ‌త‌మార్చితే క‌డ‌ప‌లో తిరిగే నాయ‌కుడు ఉండ‌డ‌ని కుట్ర‌ప‌న్నారా..? త‌న చేతికి మట్టి అంట‌కుండా అదే కుట్ర‌ను వైఎస్ కుటుంబ‌స‌భ్యుల‌పై నెట్టేసే ప్ర‌య‌త్నంచేశారా..? ప‌్ర‌భుత్వ ప‌రిపాలన‌పై ప్ర‌జ‌ల్ని ఓట్ల‌డిగే ద‌మ్ములేని చంద్ర‌బాబు కడ‌ప‌లో హ‌త్యారాజ‌కీయాల‌కు తెర‌తీశారా..? అంటే అవున‌నే అంటున్నారు వైసీపీ అధినేత జ‌గ‌న్.

ఒక్క క‌డ‌ప‌జిల్లాలోనే కాదు. చంద్ర‌బాబు నాయుడి ఐదు సంవ‌త్స‌రాల మోసాల పాల‌న, అబ‌ద్ధాల పాల‌న, అన్యాయాల పాల‌న‌కు ఇవ్వాళ రాష్ట్రంలో చంద్ర‌బాబు నాయుడు పూర్తిగా డిపాజిట్లు కూడా పోయ్యే ప‌రిస్థితి క‌నిపిస్తావుంది. ఇటువంటి ప‌రిస్థితుల మ‌ధ్య కుట్ర‌ల‌కు తావులేపారు. ఇటువంటి ప‌రిస్థితుల మ‌ధ్య కుట్ర ఏ స్థాయిలో ఉందో గ‌మ‌నించ‌మ‌ని అడుగుతావున్నా. చిన్నాన్న‌గారిని చంపేస్తే ..జ‌మ్మ‌ల మ‌డుగులో అడిగేవాడు ఉండ‌డ‌ని చిన్నాన్న‌గారిని చంపారు. చంపిన త‌రువాత ఆ నేరాన్ని కుటుంబ‌స‌భ్యుల‌పై వేసేస్తే, ఆ త‌రువాత అన్యాయంగా ఎవ‌రినైనా అరెస్ట్ కూడా చేసేస్తే. ఆ త‌రువాత చివ‌రుగా పులివెందుల‌లో ఎన్నిక‌లు జ‌రిపే వాళ్లు ఉండ‌రు అని చెప్పి అన్యాయంగా కుతంత్రాలు ప‌న్నుతావున్నారు. అంతేకాదు, అన్యాయం గా అరెస్ట్ లు చేసిన‌ప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే చంద్ర‌బాబు నాయుడు గారే నిన్న‌నే ఆదేశాలిచ్చాడ‌ట వాళ్ల‌కు సంబంధించిన మ‌నుషులంద‌రికి.

రాష్ట్ర వ్యాప్తంగా మ‌రో మూడురోజుల్లో ద‌హ‌నానికి రెడీ కాండి, హ‌త్య‌ల‌కు రెడీ కాండి. మూడుర్రోజుల్లో మీరంతా రెడీ కాండి. నేరాన్ని మాత్రం వైఎస్సార్ సీపీ పైన నెట్టేద్దాము అని చెప్పి నిన్న‌నే ఆదేశాలిచ్చాడ‌ట‌. అంటే దీని అర్ధం వీళ్ల పాల‌న‌కు వీళ్లు ఓట్లడిగే స‌త్తా వీళ్ల‌కు లేదు. అబ‌ద్ధాల‌తో మోసాల‌తో, ప్ర‌జ‌లు విసిగెత్తిపోయార‌న్న సంగ‌తి వీళ్ల‌కు తెలుసు. కావునా ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చ‌డానికి ఎన్నిక‌లంటే చంద్ర‌బాబు నాయుడుగారి ఐదేళ్లపాల‌న‌పై ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండా, కేవలం క‌డ‌పలో హ‌త్యా రాజ‌కీయాల మీద ఎన్నిక‌లు జ‌ర‌గుతావున్నాయ‌ని చెప్ప‌డానికి, నిజంగా చంద్ర‌బాబు నాయుడుగారు ప‌న్నుతావున్న ఈ కుట్ర‌ల్ని చూసిన‌ప్పుడు బాధ‌వేస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -