Saturday, April 20, 2024
- Advertisement -

పాద‌యాత్ర కంప్లీట్ అయ్యేలోపు షాకింగ్ నిర్ణ‌యం తీసుకోనున్న జ‌గ‌న్‌..

- Advertisement -

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు మినీ మ‌హాభార‌తాన్ని త‌ల‌పించ‌నున్నాయి. ప్ర‌ధానంగా టీడీపీ, వైసీపీ మ‌ధ్యే పోటీ ఉంటుండ‌నుంది. జ‌న‌సేన పార్టీ ఉన్నా అంత‌గా ప్ర‌భావం చూప‌క‌పోవ‌చ్చు. ఫిబ్ర‌వ‌రిలో రాష్ట్రంలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ఉంటుంద‌ని కేంద్ర ఎన్నిక‌ల అధికారి ప్ర‌క‌టించారు. దీంతో అన్ని పార్టీలు ఎన్నిక‌ల‌కు సిద్ద‌మ‌వుతున్నాయి.

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రో షాకింగ్ నిర్ణ‌యం తీసుకోనున్నారు. గ‌తంలో మాదిరి త‌ప్పులు చేయ‌కుండా ప్ర‌ణాలికా బ‌ద్దంగా ముందుకెల్తున్నారు. ఇప్ప‌టికే సంవ‌త్స‌రం నుంచి పాద‌యాత్ర చేస్తూ ప్ర‌జ‌ల్లో దూసుకు పోతున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ వారిక భ‌రోసా ఇస్తూ జ‌గ‌న్ ముందుకు సాగుతున్నారు. ప్ర‌జాస్పంద‌న కూడా ఊహించని రీతిలో వ‌స్తోంది.

వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని అనేక జాతీయ స‌ర్వేలు ఖ‌రాకండీగా చెప్పాయి. అయితే జ‌గ‌న్ ఇప్పుడు మ‌రో షాకింగ్ నిర్ణ‌యం తీసుకోబోతున్నారు. పాద‌యాత్ర ముగిసిన వెంట‌నే జ‌న‌వ‌రిలో అభ్య‌ర్తుల జాబితాను ప్ర‌క‌టించేందుకు రెడీ అయ్యారంట‌.

ఇప్పటికే పాదయాత్ర ఒక్క జిల్లా తప్ప దాదాపుగా ముగిసిన తరుణంలో జగన్ తన పార్టీ మీద, అభ్య‌ర్త‌ల విజ‌యావ‌కాశాలు, ఏపీ రాజకీయాల మీద కూడా మంచి అవగాహన వచ్చిందని పార్టీ వ‌ర్గాలు అంటున్నయి. దాంతో ఆయన వచ్చే ఎన్నికల్లో ఎక్కడ ఎవరిని దింపాలన్న దానిపై కొన్ని అంచనాలు ఇప్ప‌టికే పెట్టుకున్నారట. దాని ప్ర‌కార‌మే జాబితా ఉంటుంద‌నేది పార్టీ నేత‌ల మాట‌.

ఇక జగన్ పాదయాత్రతో ఆయనతో పాటుగా సర్వేల బ్రుందం కూడా పర్యటిస్తోంది. నిరంతరం జనం మూడ్ ని జగన్ కి చెబుతూ ఎక్కడికక్కడ అలెర్ట్ చేస్తోంది. జగన్ సైతం ఆశావహులను గుర్తించి ఒక్కో సీటుకు ముగ్గురు వంతున ఎంపిక చేసుకున్నారట. వారి వివరాలు సర్వే ఏజెన్సీలకు ఇచ్చి గెలుపు గుర్రాలు ఎవరో చెప్పమని కోరారట. ఈ స‌ర్వే నివేదిక‌లు జ‌న‌వ‌రిలోపు జ‌గ‌న్‌కు చేరుతాయంట‌.

అప్ప‌టిలోగా జ‌గ‌న్ పాద‌యాత్ర పూర్త‌యి..బ‌స్సు యాత్ర చేప‌ట్ట‌నున్నారు. పాదయాత్రలో 126 నియోజకవర్గాలు కవర్ చేసిన జగన్ మిగిలినవి బస్సు యాత్ర ద్వారా కవర్ చేస్తారని అంటున్నారు. ఆయా జిల్లాలకు వెళ్ళినపుడు అక్కడా అభ్యర్ధులను ప్రకటించే అవకాశలు మెండుగా ఉన్నాయని వైసీపీ వర్గాలనుంచి వ‌స్తున్న టాక్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -