Friday, March 29, 2024
- Advertisement -

బాబుకు, జ‌గ‌న్‌కు ఇంత తేడానా….?

- Advertisement -

ఆంధ్రప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల కోడ్ ఉన్నా చంద్ర‌బాబు మాత్రం త‌న‌దే పైచేయి అన్న‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఈసీ, సీఎస్ మీద బాబు త‌న అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉన్నా నేనె అత్యంత సీనియ‌ర్ అని చెప్పుకొనే బాబు అన్ని వ్య‌వ‌స్థ‌ల‌తోను ఎందుకు ఘ‌ర్ష‌ణ‌కు దిగుతున్నారు? అనే ప్ర‌శ్న‌లు ఇప్పుడు అంద‌రిలోను త‌లెత్తుతున్నాయి.

త‌ను వేసిన ఓటు త‌న పార్టీకే ప‌డిందా? అనే సందేహం వ్య‌క్తం చేయ‌డం చూస్తె బాబు దివాలాకోరు త‌నానికి నిద‌ర్శ‌నంగా చెప్ప‌వ‌చ్చు. కేబినేట్ మీటింగ్ నిర్వ‌హించాల‌న్న‌ప్పుడు ఈసీ అనుమ‌తి తీసుకుంటె స‌రిపోతుంది. కాని కేబినేట్ మీటింగ్‌ను 10న ఏర్పాటు చేస్తా ఎవ‌రు అడ్డువ‌స్తారో చూస్తా అంటే గంభీరంగా ప్ర‌కటించారు. చివ‌ర‌కు కేబినేట్ స‌మావేశాన్ని వాయిదా వేసుకోవాల్సి వ‌చ్చింది.

అయితే చంద్ర‌బాబు ప్లేస్‌లో జ‌గ‌న్ ఉండి ఉంటె ప‌రిస్థితులు ఎలా ఉంటాయో నన్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.నిజానికి వైసీపీ అధినేత‌గా జ‌గ‌న్ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్నారు. జ‌గ‌న్‌కు ఎక్క‌డ ఎలా ఉండాలో? ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హ‌రించాలో చాలా బాగా తెలుసున‌ని అంటారు పార్టీ నేత‌లు. ఎక్క‌డ ఎవ‌రిపై ఎలా దాడి చేయాలో.. ఏ అవ‌కాశాన్ని అనుకూలంగా మార్చుకోవాలో.. ఆయ‌న‌కు బాగానే తెలుసున‌ని చెబుతున్నారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యా ప్తంగా కూడా ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉంది. ఈ క్ర‌మంలోనే ఏపీలో ఎన్నిక‌లు ముగిసిన‌ప్ప‌టికీ.. కోడ్ అమ‌ల‌వుతోంది. అయినా త‌న‌దే పైచేయి అనే రీతిలో బాబు ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అదే ప్లేస్‌లో జ‌గ‌న్ ఉండి ఉంటే.. క‌నీసం అధికారుల మాట ప‌క్క‌న పెట్టి.. కోడ్‌కైనా విలువ ఇచ్చేవార‌ని చెబుతున్నారు.

నిజానికి కోడ్ ఉన్న స‌మ‌యంలో ఎలాంటి కీల‌క నిర్న‌యాలు కూడా తీసుకునే వెసులుబాటు ఉండ‌దు. అన్ని వ్య‌వ‌స్థ‌లు సీఈసీ ప‌రిధిలోకి వెల్తాయి. మంత్ర వ‌ర్గ స‌మావేశాల‌కు కూడా ఎన్నిక‌ల సంఘం నుంచి అనుమ‌తి తెచ్చుకోవాలి. ముఖ్యంగా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ను ప్ర‌త్య‌క్షంగా చూసి కూడాదానిపై జ‌గ‌న్ ఎక్క‌డా నింద లు వేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. వీవీప్యాట్ స్లిప్పుల్లో తాను ఎవ‌రికి ఓటేసింది కూడా స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న‌ప్పుడు కూడా విమ‌ర్శ‌లు చేయ‌డం అంటే.. బాబును ఏమ‌నాల‌నే వ్యాఖ్య‌లు వ‌స్తున్నాయి.ఇలాంటి చిన్న చిన్న విష‌యాల‌పై జ‌గ‌న్ ఎప్పుడూ ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేద‌ని, అధికారులతో ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ కోరుకుంటున్నార‌ని చెబుతున్నారు. మొత్తానికి జ‌గ‌న్‌కు, బాబుకు తేడా అద‌న్న‌మాట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -