Friday, April 26, 2024
- Advertisement -

రాష్ట్రంలో జ‌గ‌నే కింగ్‌…కేంద్రంలో కింగ్ మేక‌ర్‌..

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం తారాస్థాయికి చేరింది. అన్ని పార్టీలు పోటీ పోటీగా ప్ర‌చారం నిర్వ‌హిస్తుంటె మ‌రో అభ్య‌ర్ధ‌లు నామినేష‌న్లు వేస్తున్నారు. రెండు రోజుల్లో అభ్య‌ర్ధుల నామినేష‌న్ ముగుస్తుంది. ఇదంతా ప‌క్క‌న పెడితే ఇప్పుడు గెలుపు ఎవ‌రిద‌నేది రాష్ట్ర ప్ర‌జల్లో ఉత్కంఠ‌ను రేపుతోంది.ఇప్ప‌టి వ‌ర‌కు అయితే స‌ర్వేల ప్ర‌కారం వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని తేలింది. ఇప్పుడు అంద‌రి చూపు జ‌న‌సేన మీద‌నే. ఎన్నిక‌ల్లో టీడీపీ, వైసీపీకీ గాని మెజార్టి రాకుంటె ప‌వ‌న్ ప్ర‌ముఖ పాత్ర పోషిస్తార‌ని సీనియ‌ర్ నాయ‌కుడు హరి రామజోగయ్య విశ్లేషిస్తున్నారు.

నామినేష‌న్లు ఘ‌ట్టం చివ‌రికి వ‌చ్చింది. పోలింగ్‌కు స‌రిగ్గా 18 రోజులు ఉంది. ఈ 18 రోజులు అన్ని పార్టీల‌కు కీల‌కం. ప్ర‌స్తుత ప‌రిణామాలు చూస్తుంటె జ‌గ‌న‌సేన వ‌ల్ల భారీ మార్పులు వ‌చ్చే అవ‌కాశాలు లేవ‌ని కొట్టి పారేస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. జ‌గ‌న్ ఇలానే కంటిన్యూ చేస్తె భారీ మెజారిటీతో అధికారంలోకి వ‌స్తార‌ని సీనియ‌ర్ పొలిటికల్ పండిట్ ప్రవీణ్ రాయ్ విశ్లేషణ.

విశ్లేష‌ణ విష‌యానికి వ‌స్తే….175 అసెంబ్లీ సీట్ల‌లో ఎక్కువ శాతం గెలుచుకొని జ‌గ‌న్ తిరుగ‌లేని మెజారిటీతో సీఎం అవుతార‌ని చెప్పుకొచ్చారు. ఎంపీ సీట్ల విషయంలో తీసుకున్నా ఇరవైకి పైగా సాధించి జగన్ కేంద్రంలో కింగ్ మేకర్ అవుతారని కూడా ఆయన విశ్లేషించారు. ఒక్క సారి జ‌గ‌న్‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని ఏపీ ప్ర‌జ‌లు బ‌లంగా ఉన్నారంట‌. చంద్రబాబు చివరి నిముషంలో ప్రవేశపెట్టిన తాయిలాలు జనం నమ్మరని కూడా ఆయన అంటున్నారు.

ఐదు సంవ‌త్స‌రాల బాబు పాల‌న వ‌ల్ల రాష్ట్రానికి ఒరిగిందేమి లేదంటున్నారు ప్ర‌జ‌లు. నాలుగు సంవ‌త్స‌రాలు భాజాపాతో క‌ల‌సి ఉండి తీరా ఎన్నిక‌ల స‌మ‌యంలో బాబు చేస్తున్న డ్రామాలను ప్ర‌జ‌లు న‌మ్మేస్థితిలో లేరంట‌. ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోయిన పాపం టీడీపీకి శాపమవుతుందని కూడా చెబుతున్నారు.

జనసేన రంగంలోకి దిగడం వల్ల బాబు పార్టీకే భారీ నష్టం వస్తుందని అంటున్నారు. పెద్ద ఎత్తుక చీలిపోయే కాపుల ఓట్ల కారణంగా టీడీపీకి అనేక నియోజకవర్గాల్లో ఓటమి ఎదురయ్యే ప్రమాదం ఉందని కూడా విశ్లేషించారు. మొత్తానికి చూసుకుంటె పూర్తి మెజారిటీతో వైసీపీ అధికారంలోకి రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌లు తీర్పు ఎలా ఇస్తారో చూడాలి….?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -