Friday, April 19, 2024
- Advertisement -

కేసీఆర్ తో జగన్.. టీడీపీకి బలమా? బలహీనత?

- Advertisement -

అసెంబ్లీ సాక్షిగా ‘కేసీఆర్ మంచివారు’ అని జగన్ సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఇప్పుడు ఈ మాటలను పట్టుకొని రాష్ట్రానికి జగన్ అన్యాయం చేస్తున్నారని టీడీపీ మీడియా, నేతలు, చంద్రబాబు సైతం ప్రచారం మొదలు పెట్టేశారు. రాష్ట్ర భవిష్యత్తును జగన్ తాకట్టుపెడుతున్నారని గగ్గోలుపెడుతున్నాడు. అయితే వైసీపీ మాత్రం స్నేహపూర్వక వాతావరణంలోనే తెలంగాణ నుంచి మన నీళ్లు, నిధులు, నియామకాల్లో వాటాను సాధిస్తామని చెబుతున్నారు.

తెలంగాణలో సెంటిమెంట్ వర్కవుట్ అయ్యింది. కాంగ్రెస్ తో జతకట్టిన చంద్రబాబును బూచీగా చూపి కేసీఆర్ ‘ఇంకా ఆంధ్రోళ్ల పెత్తనమా’ అంటే జనం కాంగ్రెస్ ను తిరస్కరించి కేసీఆర్ ను గెలిపించారు. కేసీఆర్ పథకాలు కూడా తోడ్పడ్డాయి. కానీ ఇదే ఫార్ములాను ఆంధ్రాలో అప్లై చేసిన చంద్రబాబును ఆంధ్రా ఓటర్లు మాత్రం ఓడించేశారు.

దీన్ని బట్టి ఆంధ్రాప్రజల్లో కేసీఆర్ అన్నా.. తెలంగాణ అన్న ద్వేషభావం లేదన్న సంగతి తేటతెల్లమైంది. మరి ఇంత స్పష్టత ఉన్నా ఇంకా చంద్రబాబు మళ్లీ జగన్-కేసీఆర్ దోస్తీని భూతద్దంలో చూపిస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నాడు.

తెలంగాణలో ఉన్న సెంటిమెంట్, స్వరాష్ట్ర భావజాలం ఆంధ్రాలో లేదని మొన్నటి ఎన్నికలతో అర్థమైంది. అంత సెంటిమెంట్ రాజేసినా.. కోట్ల నిధులు పంచిపెట్టినా చంద్రబాబును ఓడించారంటే కారణం ఆయన అవినీతి, పెచ్చరిల్లిన దోపిడీ అని అర్థమవుతుందని వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. జ‌నాలు దాన్నే చూశారు తప్పితే కేసీఆర్, తెలంగాణను చూడలేదని టీడీపీ తెలుసుకుంటే మంచిదంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -