Saturday, April 20, 2024
- Advertisement -

చంద్రబాబుకు దిమ్మతిరిగే రేంజ్‌లో పాదయాత్రపై తాజా ఇంటెలిజెన్స్ రిపోర్ట్

- Advertisement -

2019లో ఎపిలో ఎవరు గెలుస్తారు అన్న ప్రశ్నకు ఎక్కడెక్కడో సమాధానాలు వెతకాల్సిన అవసరం లేదు. తన భక్తుల్లాంటివాళ్ళు, తాను ఏం చెప్తే అదే చేస్తారు అని చంద్రబాబు ఎవరి గురించి చెప్పారో వాళ్ళే ఇప్పుడు గట్టిగా సమాధానం చెప్పారు. ప్రి పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పే విశ్లేషకులు, జర్నలిస్టులు కాదు ప్రజలే తేల్చేశారు. పులివెందుల నుంచి మొదలైన జగన్ పాదయాత్రకు ప్రజాదరణ ఎక్కడా తగ్గిందిలేదు. రాయలసీమ అంతా ప్రభంజనమే కనిపించింది. చంద్రబాబు సొంత కులం జనాభా అధికంగా ఉండే గుంటూరు, కృష్ణాజిల్లాల్లో దిగ్విజయంగా సాగింది. ఇక 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు పట్టంగట్టిన గోదావరి జిల్లావాసులు పాదయాత్రకు పోటెత్తారు.

ఇక చివరాఖరిగా తిత్లీ తుఫాను సమయంలో సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలగకూడదని జగన్ పరామర్శకు వెళ్ళకపోవడాన్ని సాకుగా చూపించి శ్రీకాకుళం ప్రజలందరూ జగన్‌ని వ్యతిరేకిస్తున్నారు అనే రేంజ్‌లో తెదేపా నాయకులతో పాటు పచ్చ మీడియా జనాలు ఎపి ప్రజల ఆలోచనల్లో విషం చిమ్మే ప్రయత్నం చేశారు. శ్రీకాకుళం ప్రజలు జగన్‌ నిలదీయాలని కోరుకున్నారు. అయితే ఆశ్ఛర్యకరంగా శ్రీకాకుళం ప్రజలందరూ కూడా జగన్‌పై అన్ని జిల్లాల ప్రజలకంటే మిన్నగా అభిమానం చూపిస్తున్నారు. అన్నింటికీ మించి అడుగడుగునా చంద్రబాబు ప్రచార పటాటోపంపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి కనీస స్థాయిలో వ్యతిరేకత వచ్చినా తాటికాయంత అక్షరాలతో ప్రచారం చేయాలని చూసిన పచ్చ మీడియా కూడా జగన్‌పై సిక్కోలు ప్రజల చూపించిన అమితాభిమానం దెబ్బకు పూర్తిగా సైలెంట్ అయింది. అన్నింటికీ మించి చంద్రబాబు కూడా స్వయంగా ఇంటెలిజెన్స్ వాళ్ళతో వచ్చినవాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారా లేదా అనే విషయంపై పరిశీలన చేయించాడట. ప్రజలకు చంద్రబాబు పాలన పట్ల తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని, గట్టిగా విమర్శలు చేస్తున్నారని, జగన్‌పై స్వచ్ఛంధంగా అభిమానం చూస్తున్నారని చంద్రబాబు సొంత ఇంటెలిజెన్స్‌నే విశ్లేషించడంతో చంద్రబాబు కూడా ఆశ్ఛర్యపోయారని టిడిపి నాయకులే చెప్తున్నారు. ఇక ఈ స్థాయి ప్రజాదరణను ఆర్థిక, అంగ బలం, మీడియా బలంతో, అబద్ధపు ప్రచారాలతో మరోసారి మేనేజ్ చేయగలరా? వైఎస్ జగన్‌పై ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని జిల్లాల ప్రజలు పూర్తిస్థాయిలో అభిమానం చూపిస్తున్న నేపథ్యంలో పొలిటికల్ మేనేజ్‌మెంట్, కుట్రలు, వ్యూహాలతో చంద్రబాబు మరోసారి ఎన్నికల్లో గెలవగలడా? చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -