Saturday, April 20, 2024
- Advertisement -

సంతోషంలో జ‌గ‌న్‌….దుఖంలో బాబు….నిరాశ‌లో ప‌వ‌న్‌..

- Advertisement -

ఏపీలో పోలింగ్ ప్ర‌శాంతంగా ముగిసింది. సీన్ క‌ట్ చేస్తె ఇప్పుడు ఫ‌లితాల‌కోసం అన్ని రాజ‌కీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. రాష్ట్ర భ‌విష్య‌త్తు అభ్య‌ర్ధుల జాత‌కాలు ఈవీఎంల‌లో నిక్షిప్త‌మై ఉన్నాయి.పోలింగ్ స‌ర‌ళిని చూస్తె వైసీపీకే అనుకూలంగా ఉంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అన్ని స‌ర్వేలు కూడా వైసీపీనే అధికారంలోకి వ‌స్తుంద‌ని బ‌ల్ల గుద్ది చెప్పాయి.

అధికారంలోకి రావాల‌ని వైఎస్ జ‌గ‌న్ ప‌డిన క‌ష్టం అంతా ఇంతా కాదు. పాద‌యాత్ర మొద‌లు పెట్టిన‌ప్ప‌టినుంచి ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కు జ‌గ‌న్ తీవ్రం క‌ష్ట‌ప‌డ్డారు.బహుశా రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎవ్వరూ పడనంత స్థాయిలో కష్టపడ్డారాయన. సుదీర్ఘ పాదయాత్రతో దాదాపు ఏడాది కన్నా ఎక్కువ సమయం ప్రజల మధ్యనే గడిపారు. త‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిన త‌ర్వాత కూడా పాద‌యాత్ర కొన‌సాగించారు.

ఎన్నిక‌ల నోటిఫి కేష‌న్ వ‌చ్చిన త‌ర్వాత కూడా జ‌గ‌న్ ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉన్నారు. నెల‌ లరోజులపాటు ఎన్నికల ప్రచారంలోనూ కష్టపడ్డారు. ప్రచార పర్వం ముగిసేవరకూ మండుటెండలోనే జగన్ కష్టపడ్డారు. ప్ర‌జ‌ల తీర్పు త‌న‌కే అనుకూలంగా వ‌స్తుంద‌ని జ‌గ‌న్ ధీమాతో ఉన్నారు.

ఇక బాబు విష‌యానికి వ‌స్తె ఆయ‌న ప్రెస్టేష‌న్‌లో ఉన్నారు. జ‌గ‌న్‌, ఈసీ, సీఎస్ మీద ఒత్త‌డిలో మ‌తిస్థిమితం లేని మాట‌లు మాడ్లాడుతున్నారు.పోలింగ్ పూర్తి అయిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ఎంత అసహనంతో రగిలిపోతున్నారో అర్థం చేసుకోవ‌చ్చు.

ప్రెస్ మీట్లు మీద ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్రం, జాతీయ స్థాయిలోను ఈసీ మీద గ‌గ్గోలు పెడుతున్నారు. కింద కాలాకా త‌ర్వాత బ‌ర్నాల్ పూసుకుంటె ఏమొస్తాది. పోలింగ్ ముగిసింది. ఫ‌లితాల‌కోసం అంద‌రూ ఎదురు చూస్తున్నారు.అన్నీపోయి ఇప్పుడు వీవీ ప్యాట్ లను యాభైశాతం వరకూ లెక్కించాలని బాబు గగ్గోలు పెడుతున్నారు.

ఇక ప‌వ‌న్ విష‌యానికి వ‌స్తే ఆయ‌న పూర్తి నిరాశ‌తో ఉన్నారు. పోలింగ్ కు ముందు ఆవేశంతో ఊగిపోయిన ప‌వ‌న్ పోలింగ్ త‌ర్వాత ఎక్క‌డా క‌నిపించ‌లేదు. గుట్టు చ‌ప్పుడు కాకుండా హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇంట్లోకి చేరి మూడు నాలుగు రోజులు అవుతోందని బోగట్టా. గాజువాకలోనే వుంటానని ఇల్లు తీసుకున్నది అలాగే వుంది. భీమవరం సంగతి సరేసరి. అమరావతిలో ఆవులు దూడలు ఇల్లు అలాగే వుంది. అలాంట‌ప్పుడు ఆంధ్రాలో ఉండ‌కుండా సొంత గూటికి ప‌వ‌న్ చేరుకోవ‌డం ఏంటో ఆయ‌న‌కే తెలియాలి..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -