Friday, April 26, 2024
- Advertisement -

బాబుకు జ‌గ‌న్ కొత్త రిట‌ర్న్ గిఫ్ట్‌…

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఫ‌లితాలు ఎలా ఉన్నా రిట‌ర్న్ గిఫ్ట్‌ల‌పైనె అంద‌రిలోను ఆస‌క్తి నెల‌కొంది. రెండ‌వ సారి అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్ బాబు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించి సంచ‌ల‌నం రేపారు. ఇచ్చే రిట‌ర్న్ గిప్ట్ పై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికీ ఆ రిట‌ర్న్ గిప్ట్ ఏదో ఎవ‌రికీ అంతు ప‌ట్ట‌డంలేదు. తాజాగా దానికి సంబంధించిన వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

ఫ‌లితాలు రాక‌ముందె అధికారంలోకి వ‌స్తామ‌న్న వైసీపీ గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉంది. టీడీపీని ఎన్నికల్లో ఓడించడం, అధికారంలోకి రావడం వైసీపీ ప్రధాన లక్ష్యాలుగా వాట‌న్నిటికంటే అసలైన మరో బలమైన ఎత్తుగడ ఉందనీ, అధికారంలోకి రాగానే దాన్ని అమల్లోకి తెస్తారనె వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండోసారి అధికారంలోకి రాగానే చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ప్రకటించారు. ఆ తర్వాత రాజకీయ కారణాలతో కేసీఆర్ సైలెంట్ అయిపోయారు. ఐతే… ఆ రిటర్న్ గిఫ్ట్ ఇప్పుడు జగన్ రూపంలో రెడీగా ఉంద‌ని దానికి సంబంధించి జగన్ ఇప్పటికే తెరవెనక మంత్రాంగం పూర్తియిన‌ట్లు స‌మాచారం.

తెలంగాణాలో టీడీపీని భూస్తాపితం చేసిన విధంగానె ఏపీలోకూడా కేసీఆర్ ప్లాన్ క‌నిపిస్తోది. 2014లో అధికారంలోకి వైసీపీ వ‌స్తాద‌ని అంద‌రూ భావించినా ఫ‌లితాలద‌గ్గ‌ర బొక్క బోర్లాప‌డింది. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసె మెజారిటీ టీడీకీ ఉన్న భ‌విష్య‌త్తులో ఎక్క‌డ ప్ర‌భుత్వం ప‌డిపోతుందోన‌నె అభ‌ద్ర‌తా భావంలో ఉన్న బాబు ఫిరాయింపుల‌కు తెర‌లేపారు.

వైసీపీ నుంచీ 67 మంది ఎమ్మెల్యేలు గెలిచినా ఫిరాయింపు రాజకీయాలతో వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. వైసీపీ జెండాపై, జగన్ ఫోటో పెట్టుకొని గెలిచిన ఎమ్మెల్యేలు వరుసబెట్టి టీడీపీలో చేరారు. మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీని వీడిపోయారు.

అంత‌టితో ఆగ‌కుండా బాబు…. వైసీపీ నుంచీ గెలిచిన ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతుల మందిని టీడీపీలో చేర్చుకొని వైసీపీ శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకొని, జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చెయ్యాలని చంద్రబాబు వ్యూహం పన్నారని వైసీపీ ఆరోపించింది.

పార్టీ మారిన నేత‌ల‌పై వైసీపీ తీవ్ర అభ్యంత‌రం వ్యక్తిచేసినా….స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేసినా ఫ‌లితం ద‌క్క‌లేదు. వైసీపీ వ్యూహాలు ఫలించనివ్వకుండా చంద్రబాబు చక్రం తిప్పారన్నది రాజకీయ విశ్లేషకుల మాట. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నె జ‌గ‌న్ కూడా ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ మొద‌లు పెడ‌తార‌ని టీడీపీకి చెందిన చాలా మంది ముఖ్య నేతల్ని జగన్ తమ పార్టీలో చేర్చుకుంటారని తెలుస్తోంది.

ఇప్ప‌టికే చాలా మంది టీడీపీ నేతలు… వైసీపీ నేతలతో చర్చలు జరుపుతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తమ పార్టీ నేతలతో వైసీపీ నేతలు టచ్‌లో ఉంటుండటంపై టీడీపీ అధినేత చంద్రబాబు బ‌హిరంగంగా వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. అయిత్ జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ఉంటందంటున్నారు పార్టీ వ‌ర్గాలు.

2019లో తాము పార్టీ పిరాయింపులకు ప్రోత్సహించకుండా… టీడీపీకి రాజీనామా చేసిన వాళ్లనే వైసీపీలో చేర్చుకోవాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచీ రాజీనామా చేసి బయటకు వచ్చిన నేతలను… తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేయించి, వైసీపీ తరపున గెలిచేలా చేసుకోవాలని జగన్ పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం.టీడీపీని మాగ్జిమం ఖాళీ చేసి… చంద్రబాబుకి తిరుగులేని రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని చెప్పుకుంటున్నారు.ఇదే నిజం అయితే బాబుకు బ్యాండ్ బాజా త‌ప్ప‌ద‌న్న‌మాట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -