Tuesday, April 23, 2024
- Advertisement -

ఈసారి మంత్రి దేవినేని ఉమ‌కు ఓటమి త‌ప్ప‌దా..?

- Advertisement -

దేశవ్యాప్తంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా ఏపీలో రెండు నెల‌లు ముందు నుంచే ఎన్నిక‌ల వేడి మొద‌లైంది. అధికారం కోసం అధికార టీడీపీ పార్టీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ పార్టీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మ‌ళ్లీ అధికారంలోకి రావ‌ల‌ని టీడీపీ. ఈసారి ఎట్టి ప‌రిస్థితుల‌లో అధికారంలోకి రావ‌ల‌ని తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే కృష్ణాజిల్లా మీద స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టాయి ఈ రెండు పార్టీలు. కృష్టాజిల్లాలో విజ‌యం సాధిస్తే రాష్ట్రా వ్యాప్తంగా విజ‌యం సాధించిన‌ట్లే ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి. 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల‌లో టీడీపీ 10 , వైసీపీ 5, బీజేపీ 1 సీట్లు గెలిచాయి. అయితే 2019 జ‌రిగే ఎన్నిక‌ల‌లో ఎక్కువ సీట్లలో గెలిచి అధికారంలోకి రావ‌ల‌ని చూస్తుంది వైసీపీ. దీనిలో భాగంగానే మైల‌వ‌రం సీటుపై ప్ర‌త్యేక దృష్టి సారించిన‌ట్లు స‌మాచారం.

కృష్టాజిల్లా మైల‌వ‌రంలో టీడీపీకి మంచి ప‌ట్టుంది. గ‌త నాలుగు ఎలెక్ష‌న్స్‌ను గ‌మ‌నిస్తే అక్క‌డ టీడీపీ మూడుసార్లు విజ‌యం సాధించింది. ఇక్క‌డ నుంచి రెండుసార్లు విజ‌యం సాధించారు దేవినేని ఉమ‌. సీఎం చంద్ర‌బాబుకు బాగా న‌మ్మ‌క‌స్థుడు, క‌మ్మ కులానికి చెందిన దేవినేని ఉమ మ‌రోసారి మైల‌వరం నుంచి పోటీ చేయ‌డానికి రెడీ అవుతున్నారు. గ‌త ఎన్నిక‌లో వైసీపీ త‌రుపున పోటీ చేసిన జోగి ర‌మేశ్‌ను ప‌క్క‌న పెట్టి మరి మ‌రో నాయ‌కుడిని తెర‌మీద‌కు తీసుకువ‌చ్చాడు జ‌గ‌న్‌. ఈసారి మైల‌వ‌రంలో వైసీపీ జెండా ఎగ‌ర‌ల‌ని జ‌గ‌న్ భావిస్తున్నాడు. దేవినేని ఉమ‌ను ఓడిస్తే, చంద్ర‌బాబును స‌గం ఓడించిన‌ట్లే అని ఆలోచ‌న చేస్తున్నాడు జ‌గ‌న్. దీనిలో భాగంగానే తెర మీద‌కు మాజీ మంత్రి వ‌సంత నాగేశ్వ‌రావు కొడుకు వ‌సంత కృష్టాప్ర‌సాద్‌ను మైల‌వ‌రం తీసుకువ‌చ్చారు.

ఆర్థికంగా బ‌ల‌మైన నాయ‌కుడు, పైగా క‌మ్మ కుల‌స్థుడు కావ‌డంతో వ‌సంత కృష్ణప్ర‌సాద్ అయితే దేవినేని ఉమ‌కు స‌రైన ప్ర‌త్యర్థి అని భావించి అత‌న్ని రంగంలోకి దించాడు జ‌గ‌న్‌. గ‌తంలో నందిగామ‌లో పోటీ చేసి దేవినేని ఉమ మీద పోటీ చేసి ఓడిపోయాడు వ‌సంత కృష్టప్ర‌సాద్‌. ఈ సారి జ‌రిగే ఎన్నిక‌ల‌లో అత‌నిపై విజ‌యం సాధించి లెక్క స‌రిచేయ‌ల‌ని భావిస్తున్నాడు. జ‌గ‌న్ వ‌సంత కృష్ట‌ప్ర‌సాద్‌ను విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేయ‌మ‌న్న‌ప్ప‌టికి,తాను మైల‌వ‌రం నుంచే పోటీ చేస్తాన‌ని, అక్క‌డ తేల్చుకోవాల్సిన లెక్క‌లు కొన్ని ఉన్నాయాని ప‌ట్టుబ‌ట్టి మరి మైల‌వ‌రం వ‌చ్చారు వ‌సంత‌. దీనిని బ‌ట్టి చూస్తే ఉమ‌కు గ‌ట్టి పోటీ వ‌సంత కృష్టప్ర‌సాద్‌ ఇవ్వ‌డానికి రెడీ అవుతున్న‌ట్లే ఉంది. ఇటీవ‌ల త‌మ అనుచ‌రుల‌పై పోలీసులు చేత అక్ర‌మ కేసులు పెట్టించార‌ని ,మైల‌వ‌రం పోలీస్ స్టేష‌న్ ఎదుట భారీ ఎదున ధర్నా చేశారు వ‌సంత కృష్టప్ర‌సాద్‌. ఉమ ఇచ్చిన ఆదేశాల‌తోనే పోలీసులు ఇలా చేశార‌ని ఆయ‌న ఆరోపించ‌డం జ‌రిగింది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు , త‌మ అధికారుల‌దే త‌ప్ప‌ని తేల్చే వారిని సస్పెండ్ చేశారు.

ఈ విష‌యంలో మంత్రి ఉమకు కంటి మీద కునుకు లేకుండా చేశారు వ‌సంత. ఈసారి ఉమ‌ను ఓడించ‌డానికి వ్యూహాలు ప‌న్నుతున్నాడు వ‌సంత‌. దానికి త‌గినన్ని ప్ర‌ణ‌ళిక‌లు కూడా ర‌చిస్తున్నాడు వ‌సంత కృష్ట‌ప్ర‌సాద్‌. ఊరురా తిరుగుతు పార్టీపై ప‌ట్టు పెంచుకుంటుపోతున్నారు. పైగా ఉమ‌పై నియోజిక వ‌ర్గంలో తీవ్ర అంస‌తృప్తి నెల‌కొంది. త‌మ కులం వారికే ఉమ ఎక్కువ ప్రాధ‌న్య‌త‌ను ఇస్తున్నార‌ని చాలామంది బ‌హిరంగంగానే వెల్ల‌డిస్తున్నారు. ఇక ఊరురా ఏర్పాటు చేసిన జ‌న్మ‌భూమి క‌మిటీలలో అక్ర‌మాలు చాల‌నే వెలుగు చూశాయి. దీంతో మంత్రి తీవ్ర విమ‌ర్శ‌లను ఎదుర్కొంటున్నాడు. కొంత‌మంది ఈసారి ఉమ నూజివీడు నియోజ‌ర్గం నుంచి పోటీ చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నార‌ని అని కూడా అంటున్నారు. కాని ఉమ మాత్రం మ‌ళ్లీ తాను మైల‌వ‌రం నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ సాధిస్తాన‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఎవ‌రి ఆలోచ‌న‌లు ఎలా ఉన్న‌ప్ప‌టికి మైల‌వ‌రంలో ఈసారి మంత్రికి గ‌డ్డుకాల‌మే అని చాలామంది నియోజిక వ‌ర్గ ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. చాలామంది నియోజిక వ‌ర్గ ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -