Wednesday, April 24, 2024
- Advertisement -

టీడీపీ వేర్లు కూడా పీకేసిన జగన్.. సరికొత్త చరిత్రను లిఖించాడు..!

- Advertisement -

తెలుగు దేశం పార్టీకి దశబ్దాలుగా.. అంటే పార్టీ మొదలు నుంచి ఎంతో పట్టుకొమ్మలుగా ఉండే ఓ విషయంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. సినీయర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయనకు పేరు తెచ్చిపెట్టిన వాటిల్లో మండల వ్యవస్థ ఒక్కటి. ఎన్టీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన మండ‌ల వ్య‌వ‌స్థ‌ను నాటి ఉమ్మ‌డి రాష్ట్రంలో టీడీపీకి ఎంతో ప్లస్ అయ్యాయి.

మండలం కేంద్రం తమకు దగ్గరలోనే ఉండేది. ఇక తెలంగాణలో కూడా సీఎం కేసీఆర్ మండ‌లాలు, రెవెన్యూ డివిజ‌న్ల‌తో పాటు జిల్లాల‌ను కూడా విభ‌జించి పాల‌న‌ను మ‌రింత ద‌గ్గ‌ర‌కు తీసుకువ‌చ్చారు. ఇప్పుడు ఏపీలో సీఎం జగన్ సైతం.. తాను అధికారంలోకి రాగానే ప్ర‌తి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక జిల్లా చేస్తాన‌ని హామీ ఇచ్చారు. దాంతో ఇప్పుడు జిల్లాల విభజనపై ఏపీలో కసరత్తులు మొదలయ్యాయి. కరోనా కారణంగా ఏపీలో జిల్లాల విభజన ఆగిపోయింది. లేకుంటే ఈ పాటికి ఓ కొలొక్కి వచ్చేది.

ఇప్పుడు జ‌గ‌న్ జిల్లాల విభ‌జ‌న‌కు ముందుగానే రెవెన్యూ డివిజ‌న్లు, మండ‌లాల‌ను కూడా విభ‌జించి.. వీటి సంఖ్య పెంచాల‌ని చూస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఏపీలో ఉన్న 51 రెవెన్యూ డివిజ‌న్ల‌కు తోడు కొత్త‌గా మ‌రో 22 రెవెన్యూ డివిజ‌న్లు ఏర్పాటు చేయ‌నున్నారు. అయితే డివిజన్లను విభజించడానికి ముందే ఇంకొన్ని కొత్త మండలాలను ఏర్పాటు చేయనున్నారట. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు మండ‌ల వ్య‌వ‌స్థ త‌మ‌దే అని గొప్పులు చెప్పుకునే టీడీపీకి అది కూడా మిగ‌ల‌దు.

నాడు ఎన్టీఆర్ మండ‌ల వ్య‌వ‌స్థ తీసుకువ‌చ్చినా చంద్ర‌బాబు ప‌దే ప‌దే అది త‌మ గొప్ప‌గా చెప్పుకునే వారు. ఇక జ‌గ‌న్ ఇప్పుడు జిల్లాలు, డివిజ‌న్లు, మండ‌లాలు కూడా విభ‌జిస్తే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చ‌రిత్ర త‌మ ఖాతాలో వేసుకున్న టీడీపీకి అది కూడా చెప్పుకునే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు టీడీపీ చరిత్రను చెరిపేసి.. తన ఖాతలో సరికొత్త చరిత్రను సృష్టించనున్నారు. ఇక బాబు ప‌దే ప‌దే ఎన్టీఆర్ మండ‌ల వ్య‌వ‌స్థ తెచ్చార‌ని.. ఎన్టీఆర్ పేరు ఎత్తే ఛాన్స్ లేకుండా జగన్ గట్టి దెబ్బకొట్టారు.

ఆ మంత్రులందరికీ షాక్ ఇవ్వనున్న సీఎం జగన్..?

సీనియర్లకు షాక్.. జూనియర్లకు పదవులు.. జగన్ వ్యూహం ఏంటి ?

సీఎం జగన్ ను ఫిదా చేస్తున్న దేవినేని అవినాష్..!

రైతుకు ట్రాక్టర్‌.. చంద్రబాబు రాజకీయం.. ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -