Friday, March 29, 2024
- Advertisement -

ఎవరికి తెలియని విషయాలు ఈ పుస్తకంలో ఉంటాయి : వైఎస్ షర్మిల

- Advertisement -

మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా ఆయన భార్య విజయమ్మ రాసిన ’నాలో.. నాతో వైఎస్సార్’ పుస్తకాన్నిఏపీ సీఎం జగన్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్ షర్మీల మాట్లాడుతూ.. ’నాన్న జీవిత విశేషాలపై అమ్మ రాసిన పుస్తకమే.. నాలో నాతో వైఎస్సార్. ఇది చాలా మంచి పుస్తకం.. హృదయాన్ని తాకే విధంగా ఉంది.

నాన్నకు సంబంధించిన సంగతులు ఈ పుస్తకంలో తెలుసుకోవచ్చు. తనకు మాత్రమే తెలిసిన నాన్నలోని కోణాన్ని తెలుపుతూ అమ్మ ఈ పుస్తకం రాసింది. ఈ విధంగా నాన్నను లోకానికి కొత్తగా పరిచయం చేసింది. ఈ పుస్తకం చదువుతున్నంత సేపు అమ్మ, నాన్నలతో కలిసి ప్రయాణం చేస్తున్నట్లు అనిపించింది. వారిద్దరితో ఎమోషనల్ జర్నీ చేస్తున్నట్లు భావించాను. నిజం చెప్పడం సులభం కాదు .. అయినప్పటికీ ధైర్యంగా అమ్మ నిజం చెప్పింది.

ఈ పుస్తకంలో నాన్నకు సంబంధించిన అన్ని విషయాలను తెలిపింది. వైఎస్సార్ గొప్ప స్ఫూర్తిమంతమైన వ్యక్తి. ఆయనను జ్ఞాపకం చేసుకునే అవసరం ఉంది. అందుకే అమ్మ ఈ బుక్‌ రాసింది. వైఎస్సార్‌ అందరికీ ఒక స్ఫూర్తి’ అని వైఎస్ షర్మిల అన్నారు. అందరూ వైఎస్‌ జీవిత చరిత్రను తెలుసుకోవాల్సి ఉందని ఆమె అన్నారు.

ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు.. దద్దరిల్లిన సోషల్ మీడియా..!

సీఎం జగన్ నిర్ణయంకు జనసైనికులు ఆనందం.. ఏంటి సంగతి ?

అంబులెన్స్ నడిపిన ఎమ్మెల్యే రోజా.. వీడియో..!

వైఎస్సార్ కు జగన్ నివాళులు.. భర్తపై పుస్తకం రాసిన వైఎస్ విజయమ్మ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -