Friday, April 26, 2024
- Advertisement -

వైఎస్ సునీత వ్యాఖ్య‌లు టీడీపీకీ చెంప‌పెట్టు..

- Advertisement -

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు రాష్ట్రంలో ఆస‌క్తిక‌రంగా మారింది. ఎన్నిక‌ల స‌య‌మంలో ఇది రాజ‌కీయ రంగు పులుముకోవ‌డంతో ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ప్ర‌ముఖ నాయకుడు చ‌నిపోతె అధికార‌పార్టీమీద విమ‌ర్శ‌లు చేయ‌డం స‌హ‌జం. ప్ర‌తిప‌క్షంలో ఏపార్టీ ఉన్నా అది మామూలే. మాబాబాయ్‌ని అధికార పార్టే హ‌త్య చేయించి రాజ‌కీయంగా వాడుకోవాల‌ని చూస్తోంద‌ని జ‌గ‌న్ ఆరోపించారు. అయితే టీడీపీ మాత్రం ఆ హ‌త్య వైఎస్ కుంటుంబ‌మే చేయించిన‌ట్లుగా మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంది. తెల్లారి నుండే, ప్రెస్ మీట్లు, లైవ్ ఇంటర్వ్యూలతో ఛెడా-మఢా మాటలతో ఎదురుదాడి చేసింది. ఏకంగా జ‌గ‌నే సింప‌తీ కోసం ఈ హ‌త్య చేయించార‌ని ఏకంగా సీఎం బాబె సెల‌విచ్చారు. అయితే వివేకా కూత‌రు సునీతారెడ్డి చేసిన వ్యాఖ్య‌లు టీడీపీకీ చెప్పుతో కొట్టిన‌ట్లు స‌రిపోయింది.

తన తండ్రి హత్య ఘటనపై జరుగుతున్న దర్యాప్తు విధానం సరిగా లేదని, ముఖ్యమంత్రే స్వయంగా ఈ కేసును తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. త‌న తండ్రి హత్య కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)కు కూతురు సునీతారెడ్డి విన్నవించారు.ఈ కేసులో తమ వాళ్లనే దోషులుగా చూపిస్తారేమోనని భయంగా ఉందని, తన అన్నే తన తండ్రిని చంపారన్నట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు రిపోర్ట్ చేసే సంస్థ కాకుండా మరే ఇతర దర్యాప్తు సంస్థతోనైనా విచారణ చేయించాలని కోరినట్టు చెప్పారు. అయితే దీనిపై కేంద్ర‌హోంశాఖ‌ను క‌ల‌వాల‌ని ఈసీ చెప్ప‌డంతో సునీత కేంద్ర హోంశాఖ కార్య‌ద‌ర్శిని క‌ల‌శారు.

వివేకా హత్యపై జరుగుతున్న దర్యాప్తు విధానం సరిగా లేదని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. మా తండ్రి హత్యకు కారకులెవరో నిగ్గుతేల్చేందుకు సీబీఐ విచారణ కోరాం. ఇప్పటికే హైకోర్టులో కేసు వేశారు కాబట్టి.. హైకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి సూచించినట్లు సునీత వివరించారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -