Thursday, April 25, 2024
- Advertisement -

Exclusive: 150 మంది అభ్య‌ర్ధుల లిస్ట్ రెడీ… ప్ర‌క‌టించేది అప్పుడే…?

- Advertisement -

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు మ‌హాసంగ్రామాన్ని త‌ల‌పిస్తాయ‌న‌డంలో సందేహంలేదు. ఎన్నిక‌ల టైం ద‌గ్గ‌ర ప‌డుతున్న‌కొద్దీ ప్ర‌ధాన పార్టీలు దూకుడు పెంచాయి. అభ్య‌ర్తుల ఎంపిక‌, ప్ర‌క‌ట‌న నుంచి ఎన్నిక‌ల ప్ర‌చారం ఎలా నిర్వ‌హించాలి అనే దానిపై సుమాలోచ‌న‌లు చేస్తున్నారు. వైసీపీ, జ‌న‌సేన‌, టీడీపీ+కాంగ్రెస్ మ‌ధ్య‌నే ముక్కోణ‌పు పోటీ ఉండ‌నుంది. అయితే జ‌న‌సేన‌ను అటుంచితే వైసీపీ, టీడీపీ మ‌ధ్య‌నే పోరు జ‌ర‌గ‌నుంది.

2014 ఎన్నిక‌ల్లో అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించే విష‌యంలో జ‌గ‌న్ చేసిన త‌ప్పు వ‌ల్ల కొద్ది శాతం ఓట్ల తేడాతో ఓడి ప్ర‌తిప‌క్షంలో కూర్చుకున్నారు. ఈ సారి అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వ‌కుండా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.ఈ సారి అధికారంలోకి రాకుంటే వైసీపీ మ‌నుగడ క‌ష్ట‌మ‌నే అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

2017 లో జ‌గ‌న్ ప్ర‌తీష్టాత్మ‌కంగా ఇడుపుల పాయ‌లో ప్రారంభించిన పాద‌యాత్ర చివ‌రి ద‌శ‌కు చేరింది. సంవ‌త్స‌రానికి పైగా పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్ రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను క‌లుసుకొని వారి స‌మ‌స్య‌ల‌ను వింటూ అధికారంలోకి వ‌స్తే తాము ఏమి చెస్తామో భ‌రోసా ఇస్తూ ముందుకు సాగారు.

పాద‌యాత్ర‌లోనే అభ్య‌ర్తుల ఎంపిక విషంయ‌లో జ‌గ‌న్ ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఒక ప‌క్క ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వే…మ‌రో ప‌క్క త‌న సొంత స‌ర్వేల వివ‌రాలు జ‌గ‌న్ వ‌ద్ద ఉన్నాయి. అ స‌ర్వే వివ‌రాల ప్ర‌కారం పార్టీ త‌రుపున గెలుపు గుర్రాల లిస్ట్ రెడీగా ఉంద‌ట‌. అదే విధంగా నియోజ‌క వ‌ర్గాల్లో పోటీ చేసే అభ్య‌ర్తుల‌కు ప్ర‌జాబ‌లం ఎంత వుంది అనే వివ‌రాలు కూడా జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఉన్నాయి. మ‌రో వైపు కొన్ని న‌యోజ‌క వ‌ర్గాల్లో అభ్య‌ర్తుల‌ను ఇప్ప‌టికే కొంత మందిని ప్ర‌క‌టించారు.

ఫిబ్ర‌వ‌రిలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల‌ ఉంటుంద‌ని ఎన్నికల సంఘం ప్ర‌క‌టించ‌డంతో అన్ని పార్టీలు ఎన్నిక‌ల స‌మ‌రానికి సిద్ద‌మ‌వుతున్నారు. దీనిలో భాగంగానే సీఎం చంద్ర‌బాబు నాయుడు పార్టీ త‌రుపున అభ్య‌ర్తుల‌ను సంక్రాంతి త‌ర్వాత ప్ర‌క‌టిస్తార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రో వైపు జ‌న‌సేన కూడా జ‌న‌వ‌రి 26 న అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఈ నెల 9న ఇచ్చాపురంలో భారీ బ‌హిరంగ స‌భ‌తో జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను ముగించ‌నున్నారు. అ త‌ర్వాత జ‌గ‌న్ అభ్య‌ర్తుల విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటార‌నే ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. తెలంగాణలో రెండు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించి కేసీఆర్ విజయం సాధించిన నేపధ్యంలో జ‌గ‌న్ కూడా 9న అభ్య‌ర్తుల జాబితాను విడుద‌ల‌ చేస్తార‌నే ఊహాగానాలు వ‌స్తున్నాయి.

మెుదటి విడతలో భాగంగా 52 మంది అభ్యర్థులను ప్రకటించనున్నారని వారిలో 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారంటూ జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే 10 మంది ఎంపీ అభ్యర్థులను కూడాప్రకటిస్తారంటూ ప్రచారం ఊపందుకొంది. అయితే 9న అభ్య‌ర్తుల ప్ర‌క‌ట‌న ఉండ‌ద‌ని పార్టీ విశ్వ‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

ఇప్పటికే అన్ని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలకు, ఎమ్మెల్యేలకు, మాజీ ఎంపీలకు, కీలక నేతలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాచారం అందించింది. అభ్య‌ర్తుల ప్ర‌క‌ట‌న లేకుండా ఎన్నిక‌ల శంఖారావం పాద‌యాత్ర‌ ముగింపు స‌భ‌లో పూరించ‌నున్నారంట‌.

అయితే అభ్య‌ర్త‌ల ప్ర‌క‌ట‌న మ‌రింత ఆల‌స్యం కానుంద‌నే స‌మాచారం పార్టీ వ‌ర్గాల‌నుంచి వ‌స్తోంది. అయితే విశ్వ‌స‌నీయ‌త స‌మాచారం ప్ర‌కారం ఇప్ప‌టికే జ‌గ‌న్ వ‌ద్ద‌ 150 మంది అభ్య‌ర్తుల లిస్ట్‌ను రెడీగా ఉంద‌ట‌. అభ్య‌ర్తుల ప్ర‌క‌ట‌న తేదీని జ‌గ‌న్ ఇచ్చాపురం స‌భలో ప్ర‌క‌టించ‌నున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -