Friday, April 19, 2024
- Advertisement -

భారీగా డబ్బులిస్తానన్న టిడిపి ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వలేనన్న జగన్ః రాధాకృష్ణ

- Advertisement -

డబ్బులకు సీట్లు అమ్ముకోవడంలో, కేవలం పారిశ్రామికవేత్తలకే పార్టీలో చేరిన క్షణంలోనే రాజ్యసభ పదవులు హామీ ఇవ్వడంలో చంద్రబాబు నైజం గురించి కొత్తగా చెప్పేదేముంది. అయితే జగన్ మాత్రం అలాంటి డబ్బు రాజకీయాలకు నేను దూరం అని నిరూపించుకున్నాడు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి కూడా ఏ స్థాయిలో సీట్లు అమ్ముకున్నాడో చెప్పనవసరం లేదు. ఆ తర్వాత పార్టీని కూడా గుంపగుత్తగా సోనియాకు అమ్మేసి క్యాష్ చేసుకోవడంతో పాటు కేంద్ర మంత్రి పదవిని కూడా తెచ్చుకున్నాడనుకోండి. అది వేరే విషయం.

అయితే ఇప్పుడు జగన్ మాత్రం డబ్బులకు సీట్లు అమ్ముకునే రాజకీయానికి తాను వ్యతిరేకం అని నిరూపించుకున్నాడు. స్వయంగా ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణనే ఒప్పుకున్నాడు. మాజీ మంత్రి టిడిపి ఎమ్మెల్యే రావెల కిషోర్‌ బాబు ముందుగా వైకాపాలోనే చేరాలనుకున్నాడు. భారీగా డబ్బు కూడా ఆఫర్ చేశాడు. పార్టీ కోసం కూడా భారీగా ఖర్చు పెడతానని చెప్పాడు. అయితే రావెల అడిగిన పత్తిపాడు సీటు విషయంలో ఆల్రెడీ మేకతోటి సుచరితకు మాట ఇచ్చానని……..ఆ మాటను వెనక్కు తీసుకోలేనని జగన్ చెప్పాడు. అయితే కనీసం తాడికొండ సీటు ఇస్తానని మాట ఇచ్చినా పార్టీలోకి వస్తానన్నాడు రావెల. కానీ జగన్ మాత్రం తాడికొండ సీటు కూడా డాక్టర్ శ్రీదేవికి ఇస్తానని మాట ఇచ్చేశానని ఆ సీటు కూడా ఇవ్వలేనని చెప్పేశాడు. ఇక చేసేదేమీ లేక జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నాడు రావెల.

ఈ విషయాలన్నీ కూడా స్వయంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణనే తన మీడియా సంస్థలో చెప్పాడు. ఎల్లో మీడియా సంస్థలన్నీ ఈ విషయాలను చెప్పాయి. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. మాజీ మంత్రి, ఇప్పటి టిడిపి ఎమ్మెల్యే అయిన రావెల దగ్గర డబ్బు ఏ స్థాయిలో ఉంటుందో చెప్పనవసరంలేదు. అయినప్పటికీ జగన్ మాత్రం డబ్బులకు సీట్లు అమ్ముకోకుండా మొదటి నుంచీ పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్ళకే టికెట్స్ ఇవ్వాలని నిర్ణయించుకోవడంపై ప్రత్యర్థులు కూడా ప్రశంసిస్తున్నారు. డబ్బు రాజకీయాలకంటే నిజాయితీగల రాజకీయాలకు, నమ్మినవాళ్ళకు న్యాయం చేసే విషయంలో తెలుగు రాజకీయ నాయకులందరికంటే జగన్ ముందు వరుసలో ఉన్నారన్న ప్రశంశలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -