Thursday, April 18, 2024
- Advertisement -

కాంగ్రెస్‌, భాజాపా రెండు పార్టీల‌పై ఏపీ ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం పోయింది..

- Advertisement -

తెలుగు రాష్ట్రాన్ని అడ్డ‌గోలుగా విభ‌జించి కాంగ్రెస్ మోసం చేస్తే… నవ్యాంధ్రకు అన్నీ చేస్తామని ఆశల పల్లకిలో ఊరేగించి చివరికి న‌ట్టేట భ‌జాపా ముంచింద‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ విమ‌ర్శించారు. అందుకే కాంగ్రెస్‌, భాజాపాలాపై రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం పోయింద‌న్నారు.ఇండియా టుడే 18వ ఎడిషన్‌ కాంక్లేవ్‌లో భాగంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జగన్ త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు.

ఏపీకీ ప్ర‌త్యేక హోదా ప్ర‌జ‌లు అడిగిందికాద‌ని …విభ‌జ‌న స‌మ‌యంలో పార్ల‌మెంట్‌లో కాంగ్రెస్ , బీజేపీలు ఇచ్చిన హామీ అని గుర్తు చేశారు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు దీటుగా ఏపీ అభివృద్ధి చెందాలంటే అది ప్రత్యేక హోదాతోనే సాధ్యమని చెప్పారు. హోదా వ‌ల్ల ప‌న్ను మిన‌హాయిపులు ఉంటాయ‌ని అందు వ‌ల్ల పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. కేంద్రంలో ఏ ప్ర‌భుత్వం ఏర్ప‌డినా ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌న్న వారికే మ‌ద్ద‌తు ఇస్తామ‌ని జ‌గ‌న్ మ‌రో సారి స్ప‌ష్టం చేశారు.

తాను ముఖ్యమంత్రి అయితే.. రాష్ట్రానికి ఏం చేస్తారు..? జాతీయ రాజకీయాల్లో తన వైఖరి, అదేవిధంగా ఏపీకి శత్రువులు ఎవరూ లాంటి విషయాలను జగన్ ప్రస్తావించారు. రాష్ట్ర ప్ర‌జ‌ల స‌హాకారంతో సీఎంను అయితే ఏం చేస్తానోకూడా వెల్ల‌డించారు. బాబు పాల‌న‌లో అనేక అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని …ఓ వ‌ర్గం వారికి మాత్ర‌మే మేలు జ‌రిగింద‌న్నారు. వైసీపీ అధికారంలోకి వ‌స్తే ఎవ‌రిమీద వివ‌క్ష చూప‌కుండా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు పథకాలు చేరేలా చేస్తామ‌న్నారు. తి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి.. ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేవిధంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. న‌వ‌ర‌త్న ప‌థ‌కాలు రాష్ట్రాభివృద్ధికి ఎంతో ఉప‌యేగ ప‌డ‌తాయ‌న్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -