ఏపీలో వైఎస్ జగన్ తరువాత అంతా అతనేనట..?

1107
YSRCP Kadapa MP YS Avinash Reddy Popularity
YSRCP Kadapa MP YS Avinash Reddy Popularity

వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పులివేందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికలో టీడీపీ సభ్యుడు ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి పై 90,110 ఓట్ల ఆధిఖ్యతతో గెలుపోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్న విషయం తేలిసిందే.

ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వెంటనే ప్రజా పాలన పై దృష్టి పెట్టిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి బిజీబిజీగా ఉన్నాడు. సొంత నియోజకవర్గ ప్రజలను కలుసుకునే అవకాశం కలగడం లేదు. అయితే ఇప్పుడు పులివెందుల ప్రజలకు ఆ కొరత లేకుండా అవినాష్ రెడ్డి తీరుస్తున్నాడు. నియోజకవర్గ ప్రజల్లో వైయస్ జగన్ రావడం లేదనే భావన రాకుండా అవినాష్ రెడ్డి జాగ్రత్త పడుతున్నాడు.

ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకుని.. అధికారుల దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కారం దృష్టి గా ముందడుగు వేస్తున్నాడు. అంతేకాకుండా సెకండ్ ముఖ్యమంత్రి స్థాయిలో అవినాష్ రెడ్డి పాపులారిటీ రోజు రోజుకి పెరిగిపోతుంది.

పులివేందుల నియోజకవర్గ మే కాదు ఇప్పుడు రాష్ట్ర స్థాయి నాయకులు కూడా అవినాష్ రెడ్డి కలిస్తే పని అయిపోతుందని భావనలో ఉన్నారట. బిజీబిజీగా ఉన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ ని ఎందుకు ఇబ్బంది పెట్టమని నాయకుల అందరూ అవినాష్ రెడ్డి దగ్గరికి క్యూ కడుతున్నారట.

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి సోదరుడు వివేకానంద రెడ్డి నియోజకవర్గ ప్రజల బాధ్యత చూసుకునేవారు. ఇప్పుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆ పాత్రను సోదరుడు అవినాష్ రెడ్డి పోషిస్తున్నాడు.

Loading...