Friday, April 19, 2024
- Advertisement -

జగన్ మొదటి షాక్..వైసీపీకీ షాక్ ఇచ్చి టీడీపీలో చేరిన కీలక నేత

- Advertisement -

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ భారీమెజార్టి సాధించడంతో జగన్ అధికారంలోకి వచ్చారు. తన నూరు రోజుల పాలనలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకు సాగుతున్నారు.పాలనలో ముందుకు దూసుకుపోతున్న జగన్ కు మొదటి సారిగా బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత టీడీపీలో చేరారు.

రాజకీయాల్లో వలసలు సాధారణం. పార్టీలోకి రావాలంటె పదవులకు రాజీనామా చేసి రావాలని జగన్ షరతు విధించడంతో పార్టీలో చేరడానికి ఇతర పార్టీ నేతలు వెనకాడతున్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి చాలామంది నేతలు వైకాపా, బీజేపీ వైపుకు వెళ్లారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. వరుస వలసలతోకుదేలవుతున్న టీడీపీకీ వైసీపీకీ చెందిన కీలక నేత పార్టీలో చేరడంతో బాబులో జోష్ వచ్చింది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సొంత పార్టీకి షాక్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకోవడం ఒకసారి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.సహజంగా ఎవరైనా అధికారంలో ఉన్న పార్టీ వైపే ఉండాలని ప్రయత్నం చేస్తారు. అధికార పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడానికి ఎవరూ సాహసించరు.అలాంటిది వైసీపీకి చెందిన దొన్ను దొర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.

సైకిల్ ఎక్కిన వైసీపీ నేత దొన్ను దొర ... జోష్ లో టీడీపీ

గత ఎన్నికల్లో వైసీపీ నుంచి అరకు టికెట్ ను ఆశించిన దొన్ను దొరకు పార్టీ అధిష్టానం నిరాకరించడంతో రెబల్ ఎమ్మేల్యేగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఇప్పుడు గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన తెలుగు దేశం పార్టీ తీర్థం తీసుకున్నారు.

దొన్ను దొరతో పాటు అరకు నియోజకవర్గానికి చెందిన మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు టీడీపీలో చేరారు. దొన్ను దొరకు స్థానికంగా అరకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. ఇక దీంతో అరకులో మంచి పట్టున్న నేత టిడిపిలో చేరడంతో చంద్రబాబు సంతోషంగా ఉన్నారు. పార్టీ నుంచి నేతలు వెల్లకుండా వైసీపీ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -