Friday, April 19, 2024
- Advertisement -

బాహుబ‌ళి సినిమాకు వ‌చ్చిన క‌లెక్స‌న్లన్ని నిధులు కూడా బాబు ఏపీకీ తీసుకురాలేదు…

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడిపై వైసీపీ అధికార ప్ర‌తినిధి భూమ‌ణ క‌రుణాక‌ర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. వంచనపై తిరుగుబాటులో భాగమే మంగళవారం బంద్ నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. బంద్‌ను విజ‌య‌వంతం కాకుండా ప్రజలను భయపెట్టకుండా వారికి ఆటంకం కలిగించొద్దని ప్రభుత్వాన్ని కోరారు. బాబు ప్ర‌జ‌ల‌కోసం రాజ‌కీయాలు చేయ‌డంలేద‌ని త‌న కుంటుంబంకోసం రాజ‌కీయాలు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మాన స‌మ‌యంలో ఏపీ విభజన చట్టం హామీలను ఎవరూ ప్రస్తావించలేదన్నారు. ఎవరికి వారు వారి ప్రయోజనాల గురించే మాట్లాడారు తప్పా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఎవరైనా ప్రస్తావించారా అని ప్రశ్నించారు. ప్ర‌ధాని మోదీ ఏపీకీ ఇచ్చిన హామీల‌పై క‌నీసం ఐదు నిమిషాలు కూడా మాట్ల‌డ‌లేద‌న్నారు.

అవిశ్వాసం స‌మ‌యంలో ఢిల్లీకి వెల్ల‌కుండా వీగిపోయిన తర్వాత సీఎం చంద్రబాబు ఢిల్లీ ఎందుకెళ్లారని, బీజేపీకి కృతజ్ఞతలు చెప్పడానికా? లేక కొత్త పొత్తుల కోసమా? అని ఎద్దేవా చేశారు. వంచ‌న‌కు, మోసం , ద‌గాకు మారుపేరు చంద్ర‌బాబు అని నిప్పులు చెరిగారు. తంలో కేంద్రం ప్యాకేజీ ఇచ్చినందుకు ధన్యవాద తీర్మానం చేయలేదా అని నిలదీశారు. హోదాపై చంద్రబాబు తీసుకున్నది యూటర్నా? లేక రైట్‌ టర్నా? ఏ టర్న్‌ అని ప్రజలు ప్రశిస్తున్నారని చెప్పారు.

నాలుగు సంవ‌త్స‌రాల‌క్రితం మా పార్టీ అధినేత జ‌గ‌న్ అసెంబ్లీలో చేసిన ప్ర‌సంగాన్నే పార్ల‌మెంట్‌లో కాపీ పేష్ట్ చేశార‌ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ-బీజేపీ మధ్య సంబంధాలను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ బయట పెట్టారని తెలిపారు. బాహుబ‌ళికి వ‌చ్చిన క‌లెక్స‌న్లు కూడా ఏపీకీ నిధులు కేంద్రంనుంచి బాబు రాబ‌ట్ట‌లేద‌ని ఆరోపించారు. కేంద్రంపై అవిశ్వాసం కాకుండా మీ ప్ర‌భుత్వంపై ముందు అవిశ్వాసం పెట్టుకోండంటూ సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -