Friday, March 29, 2024
- Advertisement -

జ‌గ‌న్ దాడి ఘ‌ట‌న‌పై టీడీపీకీ కౌంట‌ర్ ఇచ్చిన వైసీపీ

- Advertisement -

వైఎస్‌ జ‌గ‌న్ దాడి త‌ర్వాత వైసీపీ, టీడీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఉద్దేశ్య పూర్వ‌కంగానే జ‌గ‌న్‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగింద‌నే వార్త‌లు వ‌స్తున్నా టీడీపీ నేత‌లు మాత్రం త‌మ కుటిల బుద్దిని చాటుకున్నారు. కేసును ప‌క్క‌దారి పట్టించేందుకు, వైసీపీ వాల్ల‌ను రెచ్చ గొట్టేందుకు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర‌ప్ర‌సాద్ చేసిన వ్యాఖ్య‌ల‌కు వైసీపీ నేత‌లు గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చారు.

సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌తో అడ్డదిడ్డమైన మాటాలు మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌పై ఆయన కుటుంబ సభ్యులే హత్యాయత్నం చేశారని చెప్పడం టీడీపీ నీచ రాజ‌కీయాల‌కు ప‌రాకాస్ట‌న్నారు.అలిపిరిలో దాడి మావోయిస్టులు చేసింది కాదు.. భువనేశ్వరి చేయించారని ఎవరైనా అంటే ఒప్పకుంటారా? అలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయాల్సిన ఖర్మ మాకు లేదు’ అని వైఎస్సార్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

పక్కా పథకం ప్రకారమే జగన్‌పై హత్యాయత్నం జరిగిందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ కుట్రలో చంద్రబాబు, లోకేశ్‌, హర్షవర్దన్, సినీనటుడు శివాజీలు భాగస్వాములన్నారు. జగన్‌పై జరిగిన హత్యాయత్న ఘటనపై ఏపీ డీజీపీ చేసిన వ్యాఖ్యలు అభ్యంతకరంగా ఉన్నాయన్నారు.

అలిపిరిలో చంద్రబాబు గాయపడితే హుటాహుటిన ఆనాటి సీఎం వైఎస్ ఆర్ తిరుపతికి వెళ్లి పరామర్శించారని గుర్తు చేశారు. చంద్రబాబుపై దాడికి నిరసనగా వైఎస్ఆర్ ధర్నా చేశారని తెలిపారు. కానీ చంద్రబాబు మాత్రం జగన్‌పై జరిగిన హత్యాయత్న సంఘటనను తక్కువ చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -