Thursday, March 28, 2024
- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో హాట్‌టాపిక్‌గా మారిత రాష్ట్ర‌ప‌తి అపాయంట్‌మెంట్‌

- Advertisement -

వైఎస్ జ‌గ‌న్‌పై దాడి గ‌ట‌న‌తో రాష్ట్రంలో రాజ‌కీయాలు పూర్తిగా మారిపోయాయి. ఈ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే సిట్ విచార‌ణ జ‌రుగుతోంది. సిట్ విచార‌ణ‌లో నిందితుడినుంచి ఎటువంటి స‌మాచారం రాబ‌ట్ట‌లేక‌పోయారు. మ‌రో వైపు రాష్ట్ర పోలీసు విచార‌ణ‌పై త‌మ‌కు న‌మ్మ‌కం లేద‌ని థ‌ర్డ్ పార్టీ చేత విచార‌ణ జ‌రిపించాల‌ని మొద‌టినుంచి డిమాండ్ చేస్తున్నారు. వారు అనుకున్న‌ట్లుగా సిట్ విచార‌ణ జ‌రుగుతోంది.

వైసీపీనేత‌లు ఢిల్లీ స్థాయి రాజ‌కీయాల‌కు తెర‌లేపారు. దీన్ని జాతీయ స్థాయికి తీసుకెల్లేందుకు పావులు క‌దుపుతున్నారు. ఓవైపు ఏపీ సీఎం చంద్రబాబు కాంగ్రెస్‌తో క‌ల‌సి జాతీయ కూటమి దిశగా పావులు కదుపుతుంటే… ఇటు వైఎస్ఆర్సీపీ నాయకుల కూడా జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నంను జాతీయ స్థాయిలో రాజకీయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను క‌ల‌సి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌తో గాని, థ‌ర్డ్ పార్టీ చేత గాని విచార‌ణ జ‌రిపించాల‌ని విన్న‌వంచారు. తాజాగా రాష్ట్ర‌ప‌తి రామ్‌నాధ్ కోవింద్‌ను క‌ల‌వ‌నున్నారు.

ఇప్పుడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసేందుకు సిద్దమవుతున్నారు. రాష్ట్రపతితో భేటీ అయ్యేందుకు వారికి అపాయింట్‌మెంట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఈనెల 9న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ను కలవనున్న నేతలు.. జగన్ పై జరిగిన హత్యాయత్నాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు. సందర్భంగా జగన్‌పై దాడి కేసులో నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరనున్నారు. జగన్‌పై దాడి అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు.

త‌న‌పై దాడి కేసును దర్యాప్తు చేస్తున్న ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని జగన్ ఇప్పటికే ప్రకటించారు. జాతీయ దర్యాప్తు సంస్థలతో కానీ, లేదంటే మరే ఇతర సంస్థతో అయినా దర్యాప్తు జరిపించాలని జగన్ కోరారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరడం తెలుగురాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -