Thursday, March 28, 2024
- Advertisement -

చంద్రబాబు ఎన్ని సార్లు చెప్పించుకుంటావ్…ఖాలీ చేయ్

- Advertisement -

చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే నిప్పులు చెరిగారు. కరకట్టమీద ఉన్న అక్రమనివాసాన్ని ఖాలీ చేయాలని మరో సారి సీఆర్ డీఏ నోటీ జారీచేసింది. వారంరోజుల్లో ఖాలీ చేయకుంటే చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై ఆర్కే స్పందించారు. చంద్రబాబుకు ఏమాత్రం నైతికత ఉన్నా ఈసారి ఇచ్చిన నోటీసులకు స్పందించాలనీ, వెంటనే ఉండవల్లిలోని అక్రమ కట్టడాన్ని ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు స్పందించకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. కృష్ణానదికి వరద వస్తే ఉండవల్లిలోని ఇల్లు మునిగిపోతుందనీ, అలాంటి ఇంటిని ఖాళీ చేయడానికి చంద్రబాబుకు ఉన్న అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. చట్టాలు ఉల్లంగించి కట్టారని తెలియదా అని ప్రశ్నించారు.చంద్రబాబు కోరుకుంటే ప్రభుత్వం సురక్షితమైన ఇంటిని కేటాయిస్తుందని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు. ఇంకా మునిగిపోయే ఉండవల్లి నివాసంలోనే ఉంటానని చెప్పడం సరికాదన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా ఉండి ప్రజలకు మార్గదర్శకంగా ఉండాలిగాని ఇలా తొండి మాటలు మాట్లాడదన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -