జగన్ ను బాహుబళితో…మేకపాటి గౌతంరెడ్డిన సైరాతో పోల్చిన వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా

390
ysrcp mla roja praises on cm ys jagan and minister mekapati goutham reddy
ysrcp mla roja praises on cm ys jagan and minister mekapati goutham reddy

వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా సీఎం వైఎస్ జగన్, మంత్రి మేకపాటిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ బాహుబలివంటి వారని, మంత్రి గౌతమ్ రెడ్డి సైరా నరసింహారెడ్డిలాంటి వారంటూ పొగడ్తలు కురిపించారు. వీరిద్దరూ కూడా పెద్ద పారిశ్రామివేత్తలే అని వ్యాఖ్యానించిన రోజా… వీరిద్దరూ కలిసి రాష్ట్రానికి మంచి పారిశ్రామిక పాలసీలు తీసుకువస్తారని ధీమా వ్యక్తం చేశారు.

పారిశ్రామిక పాలసీలు తీసుకువస్తారని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొన్న రోజా… నిర్ణీత సమయంలో పారిశ్రామిక వేత్తలకు అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు. పైసా ముడుపులు లేకుండా అనుమతులు ఇవ్వాలనె లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.

త్వరలోనె . కొత్త ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొస్తామని వెల్లడించారు. స్థానికులకు ఉద్యోగాల విషయమపై అన్ని చోట్లా ఫిర్యాదులు వస్తున్నాయని… దీనిపై పారిశ్రామికవేత్తలు ఆలోచించాలని చెప్పారు.తాము అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాక ముందే పరిశ్రమలు తరలి పోతున్నాయని అరోపణలు‌ చేయడం సమంజసం కాదని అన్నారు.

Loading...