Friday, April 19, 2024
- Advertisement -

ప‌ప్పు, నిప్పుకు తుప్పు వ‌దిలించిన రోజా….

- Advertisement -

తెలంగాణాలో కూట‌మి ఘోర ప‌రాజ‌యం పాల‌వ‌డంతో ప్ర‌తిప‌క్ష పార్టీలు టీడీపీనీ టార్గెట్ చేసుకున్నాయి. కూట‌మికి అన్నీ తానై న‌డిపించిన బాబుకు ఇప్పుడు చుక్క‌లు చూపిస్తున్నారు శ‌త్రుప‌క్షాలు. ఇక తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా అయితే ఓ రేంజ్‌లో పప్పు, నిప్పును ఉతికి ఆరేసింది. రోజా చేసిన వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇవ్వ‌లేని ప‌రిస్థితుల్లో లోకేష్‌, బాబు ఉన్నారు.

ఈ ఎన్నికల్లో టీడీపీకి, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు తెలంగాణ ప్రజలు మంచి బుద్ది చెప్పారన్నారు. చంద్రబాబునాయుడు కుట్రను జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌ గుర్తించారని రోజా అభిప్రాయపడ్డారు. అందుకే వీరిద్దరూ కూడ జాగ్రత్త పడ్డారని రోజా చెప్పారు. కూకట్‌పల్లిలో సుహాసిని పోటీకి దింపి నందమూరి కుటుంబాన్ని రాజకీయంగా నాశనం చేయాలని చంద్రబాబునాయుడు ప్రయత్నించారని రోజా విమర్శలు గుప్పించారు.

రాజశేఖర్ రెడ్డి లేని కాంగ్రెస్ పార్టీ తల లేని మొండెం వంటిదని రోజా చెప్పారు. వైయస్ కుమారుడు జగన్ ను జైల్లో పెట్టించిన కాంగ్రెస్ కు ప్రజలు మంచి గుణపాఠం చెప్పారని అన్నారు. మీడియా, డబ్బు అండతో ఎన్నికల్లో గెలవాలనే చంద్రబాబు యత్నాలు ఫలించబోవని చెప్పారు. కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు ఆశీర్వదించిన విధంగానే, జగన్ ను ఏపీ ప్రజలు ఆశీర్వదించాలని… అప్పుడే రాష్ట్రంలో రాజన్న రాజ్యం వస్తుందని అన్నారు

తాను ఒక్క సీటైనా గెలిపించానని..తన నాన్న (చంద్రబాబు) ఒక్క సీటు కూడా గెలిపించలేకపోయాడని పప్పు చాలా హ్యాపీగా ఉంటారని మంత్రి లోకేష్‌కు చురకలంటించారు. చంద్రబాబు ఇక పప్పును ఓఎల్‌ఎక్స్‌లో పెట్టి అమ్మాల్సిందేనని, పప్పుకు కిరీటం పెట్టాలనుకున్న పథకాలు తారుమారయ్యాయని విమర్శించారు.

వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు విజ్ఞతగా వ్యవహరించాలని కోరారు. వైఎస్‌ జగన్‌ను ఆదరిస్తే రాజన్న రాజ్యం వస్తుందన్నారు. చంద్రబాబుకు కేసీఆర్‌ ఇచ్చే రిటర్న్‌ గిఫ్ట్‌గా ఏమిస్తారోనని తాము కూడా ఆసక్తిగా గమనిస్తున్నామన్నారు.

కూకట్‌పల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌లో టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని టీఆర్ఎస్‌ అభ్యర్థి మాధవరం కృష్ణారావు చేతిలో ఘోరంగా ఓటమి పాలైంది. సుహాసిని తరపున ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రాలేదు. బాలకృష్ణ, తారకరత్న మాత్రమే ప్రచారాన్ని నిర్వహించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -