Thursday, April 25, 2024
- Advertisement -

బాల‌య్య బంట్రోతు వ్యాఖ్య‌లు ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చిన వైసీపీ

- Advertisement -

మొద‌టి అసెంబ్లీ స‌మావేశాల్లో టీడీపీ, వైసీపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగింది. స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాంను అభినందించే స‌మ‌యంలో ఆయ‌న‌ను ఛైర్ ద‌గ్గ‌ర‌కు తొడ్కొని వెల్లే స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్‌తో పాటు ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబు కూడా వెల్లాలి. కాని బాబు ఆ ప‌నిచేయ‌కుండా అచ్చెన్నాయుడిని పంపించ‌డంపై వైసీపీ ఎమ్మెల్యే భాస్కుర్ రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. బాబు రాకుండా ఆయ‌న బంట్రోతును పంపించాడంటూ అచ్చెన్నాయుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు పెద్ద దుమారం రేపాయి.

తాను చంద్రబాబుకు బంట్రోతు అయితే… మీరంతా సీఎం జగన్‌కు బంట్రోతులా అని అచ్చెన్నాయుడు సభలోనే వైసీపీకి కౌంటర్ ఇచ్చారు. దీని మీద మాట‌ల యుద్ధం కొనసాగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్య‌ల‌కు టీడీపీ ఎమ్మెల్యే బాల‌య్య కూడా స్పందించి కౌంట‌ర్ ఇచ్చారు.

అధికార పార్టీ నేతలు అయినా, ప్రతిపక్ష పార్టీ నేతలు అయినా ప్రజలకు బంట్రోతులేననీ, ప్రజా సేవకులేనని వ్యాఖ్యానించారు. తాజాగా బాలయ్య వ్యాఖ్యలకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కౌంటర్ వేశారు.టీడీపీ ఎమ్మెల్యేలు అంతా ప్రజలకు బంట్రోతులేనని బాలయ్య భలే డైలాగ్ చెప్పారని వ్యాఖ్యానించారు. మహిళా ఎమ్మార్వోను ఇసుకలో పడేసి కొట్టిన ఎమ్మెల్యే కూడా బంట్రోతేనని ఎద్దేవా చేశారు. ఆశా చెల్లెళ్లను బండబూతులు తిట్టిన వ్యక్తి కూడా సేవకుడనేనని విమర్శించారు. ప్రజలను హింసించి వందలకోట్ల రూపాయలు ‘కె ట్యాక్స్’ వసూలు చేసిన వారు స్పీకర్ గా చేసిన పెద్ద బంట్రోతు సంతానమే కదా అని వ్యాఖ్యానించారు. మ‌రి వైసీపీ ఎంపీ విజ‌యాసాయిరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌కు టీడీపీ ఎలా కౌంట‌ర్ ఇస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -