Thursday, April 25, 2024
- Advertisement -

వైసీపీలో కీలక పరిణామాలు… ఆ సామాజిక‌ వ‌ర్గంపై గురి…

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్ సామాజిక స‌మీక‌ర‌ణాల‌పై దృష్టి సారించారు. గ‌తంలో చేసిన త‌ప్పుల‌ను స‌రిదిద్దుకొనే ప‌నిలో బిజీగా ఉంది పార్టీ. జ‌గ‌న్ ఇమేజ్‌తో గెలిచేయ‌గ‌ల మ‌న్న ధీమాతో చేసిన పొర‌పాట్ల‌ను ఈసారి పుణ‌రావృతం కాకుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది.

వైసీపీ పార్టీ విశాఖ సహా, ఉత్తరాంధ్ర జిల్లాలలో బ‌ల‌హీనంగా ఉంద‌న్న‌ది తెలిసిందే. ఆ జిల్లాలలో బలమైన సామాజిక వర్గాలను గుర్తించి అక్కున చేర్చుకునేందుకు ప్రణాళిక లను రూపొందించింది. విశాఖ నగర రాజకీయాలలో గతంలో కీలకమైన భూమిక పోషించి ప్రస్తుతం ఏ పార్టీకీ పట్టని వారుగా ఉన్న రెడ్డి కులస్థులను అక్కున చేర్చుకునేందుకు వైసీపీ వేగంగా పావులు కదుపుతోంది.

విశాఖ రాజకీయాలలో ఎంపీ లుగా, ఎమ్మెల్యేలుగా గెలిచిన చరిత్ర ఆ సామాజిక వర్గానికి ఉంది. అంగబలం, అర్ధబలం కలిగిన ఈ కులస్థులను గతంలో కాంగ్రెస్‌ పార్టీ బాగా సమాదరించి పార్టీ, ప్రభుత్వ పదవులను కట్టబెట్టింది. విభ‌జ‌న త‌ర్వాత ఆసామిజ‌క వ‌ర్గాన్ని పార్టీలు దూరంగా పెట్టాయి. ఈ పరిస్థితులను గమనిం చిన వైసీపీ వాటిని తనకు అనుకూలంగా చేసుకునేందుకు యత్నిస్తోంది.

విశాఖ‌జిల్లాలో కాంగ్రెస్‌ తరఫున టి సుబ్బరామిరెడ్డి ప్రముఖ నాయకునిగా ఎదిగిన విషయం విధితమే. అదే కాంగ్రెస్‌ పార్టీలో టి సూర్యనారాయణరెడ్డి విశాఖ రెండవ నియోజకవర్గం ఎమ్మెల్యేగా, విశాఖ నగరాభివృద్ధి సంస్ధ చైర్మన్‌గా కూడా పనిచేసి నగర రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. అలాగే, వైఎస్‌ఆర్‌ చలువతో తిప్పల గురుమూర్తిరెడ్డి ఎమ్మెల్యేగా నెగ్గారు. నగర రాజకీయాలలో తిప్పల కుటుంబం తమదైన పాత్రను పోషిస్తూ వస్తోంది. ఇలా పలు రాజకీయ కుటుంబాలు నగరంలో తమ పలుకుబడిని ఇప్పటికీ చాటుకుంటూనే ఉన్నాయి.

తాజాగా వైసీపీ వ్యూహకర్తలు పార్టీలో ఆ సామాజికవర్గం ప్రాధాన్యతను పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. తాజాగా ఉత్తర నియోజకవర్గం ఇన్‌చార్జిగా సత్తి రామకృష్ణారెడ్డి నియామకం వెనుక ఈ సమీక రణలే బలంగా పనిచేశాయి. ఇక, పెందుర్తి నుంచి మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డిని మరోమారు నిలబెట్టాలని పార్టీ యోచిస్తోంది.

గ‌తంలో టీడీపీలో ఓ వెలుగు వెలిగిన అర్బన్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడు దివంగత గంగిరెడ్డి తరువాత ఈ సామాజికవర్గాన్ని అంతగా ప్రోత్సహించిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఆసామాజిక వ‌ర్గం వైసీపీ వైపు చూస్తోంది. వైసీపీలో చేరే ప్రసక్తే లేదని ఈ మధ్యన ప్రకటించిన కాంగ్రెస్‌ నాయకుడు టి సుబ్బరామిరెడ్డితో పాటు, ఆయన వెంట ఉన్న సామాజికవర్గాన్ని కూడా ఈదిశగా తీసుకువచ్చేందుకు ఇంకా ప్రయత్నాలు సాగు తున్నాయన్న సమాచారం ఉంది.
ప్రతీ రాజకీయ పార్టీకి తమకంటూ సొంత సామాజి కవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల్లో వైసీపీ అధినాయకత్వం ఇప్పటికైనా ఈ దిశగా అడుగులు వేయడం మంచి పరిణామమేనని అంటున్నారు. ఇది విజ‌య‌వంతం అయితే పార్టీ బ‌లోపేత మ‌వుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -