Thursday, April 25, 2024
- Advertisement -

సోష‌ల్ మీడియాలో అభిమానుల ఆవేద‌న‌….? వైసీపీ అధిష్టానం ఆలోచిస్తుందా..?

- Advertisement -

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ 151 సీట్లు సాధంచి అధికారంలోకి రావ‌డంతో వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌తుల‌ చేప‌ట్టారు. వైసీపీ విజ‌యం వెనుక అభిమానులు, కార్య‌క‌ర్త‌లు, నెటిజ‌న్ల కృషి ఎంతో ఉంది. వైసీపీ అధికారంలోకి రావ‌డంలో సోష‌ల్‌మీడియా పాత్ర కూడా ప్ర‌ముఖ పాత్ర పోషించింది. పార్టీకోసం క‌ష్ట‌ప‌డిన నాయ‌కుల‌కు ప్రాముఖ్య‌త ఇవ్వ‌కుండా జ‌.గ‌న్‌ను తిట్టి పార్టీలోకి వ‌చ్చిన నాయ‌కుల‌కు ప‌ద‌వులు ఇవ్వడంతో అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు సామాజ‌కి మాధ్య‌మాల్లో ఓ వార్త వైర‌ల్ అవుతోంది.

వైకుంఠపురం, పెదకూరపాడు నియోజకవర్గానికి చెందిన అలోకం సుధాకర్ చౌదరి పార్టీలో చేర‌డంపై అభిమానులు, కార్య‌క‌ర్త‌లు మండిప‌డుతున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చే రోజున‌కూడా టీడీపీలోఉన్న‌ సుధాక‌ర్ చౌద‌రి వైసీపీ ఎక్కువ సీట్లు గెల‌వ‌డంతో వెంట‌నె పార్టీలో చేరారు. అంతే కాకుండా ఒలంపిక్ సంఘం అషోషియేష‌న్‌లో ప‌ద‌వికూడా అందుకొన్నాడు. దీనిపైనె సోష‌ల్ మీడియా అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పార్టీ కోసం ప‌నిచేసిన వారికి ప‌ద‌వులు ఇవ్వ‌కుండా పార్టీ మారిన నేత‌ల‌ను అంద‌లం ఎక్కిస్తున్నార‌ని

పార్టీలు మారిన‌ వారిని పార్టీలోకి ఆహ్వానించి…పదవులు ఇచ్చి … నిన్నటి వరకు వై.సి.పి కోసం పని చేసిన క్యాడర్ కు ఏం సందేశం ఇవ్వదలచుకున్నారో నాయకులు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయ‌ని వాపోతున్నారు. తెలుగుదేశం అధికారంలోకి ఉన్నప్పుడు ఆ గ్రామ వై.సి.పి అధ్యక్షుడి పై 6 SC,ST అట్రాసిటీ కేసులు పెట్టించాడు … ఇప్పుడు పార్టీ మారి వాళ్ళకే ఎసరు పెట్టాలని చూస్తున్నారంటూ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికైనా పార్టీ అధినాయ‌క‌త్వం ఆలోచించాల‌ని కోరుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -