మన హీరో,హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పేది వీళ్ళే..!

8459
10 Dubbing Artists In Tollywood Industry
10 Dubbing Artists In Tollywood Industry

సినీ పరిశ్రమలో ఏ హీరోయిన్ అయిన సరే.. రాణించాలంటే అభినయం, వాచకం ఉండాల్సిందే. అయితే రానురాను పరిస్థితి ఎలా అయిందంటే.. నటన వచ్చినా.. డైలాగ్స్ చెప్పడం రాకపోవడం.. అసలు భాష మీద పెద్దగా పట్టు లేకపోవడం వంటి జరుగుతూ వస్తున్నాయి. దాంతో డబ్బింగ్ ఆర్టిస్టులకు పని ఎక్కువైంది. నటనకు తగ్గట్లుగా డబ్బింగ్ చెప్పడం కష్టంతో కుడుకున్న పనే.

కానీ ఇందులో కొందరు సింగర్స్ కి ఇవన్నీ ఈజీనే. సింగర్ మనో వెండితెరపై రజనీకాంత్ కి తెలుగులో వాయిస్ ఇచ్చాడు. ఇప్పటికీ రజనీకి వాయిస్ ఇస్తున్న మనో అంతటి ఆగకుండా కమల్ హాసన్ కి కూడా కొన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పాడు. ఇక ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం దశావతారం మూవీలో 10పాత్రలకు గాను 7పాత్రలకు బాలు డబ్బింగ్ చెప్పారు. అన్నమయ్య సినిమాలో సుమన్ కి డబ్బింగ్ చెప్పి బెస్ట్ మేక్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు అందుకున్నాడు.

ఇక బాలు సోదరి ఎస్పీ శైలజ కూడా మురారి మూవీలో సోనాలి బింద్రే,నిన్నే పెళ్లాడతా మూవీలో టబుకి అలాగే సంఘవి,శ్రీదేవి తదితరులకు కూడా డబ్బింగ్ చెప్పింది. ఇక సాంగ్స్ తో అలరించే హేమ చంద్ర రంగంలో, రాజారాణి తదితర చిత్రాల్లో డబ్బింగ్ చెప్పాడు. అలానే దృవ మూవీలో అరవింద్ స్వామికి డబ్బింగ్ చెప్పాడు. రఘు కుంచె చాలా మందికి డబ్బింగ్ చెప్పారు. సదా ,త్రిష ,తమన్నా,మీరా జాస్మిన్,కమిలిని ముఖర్జీ, అనుష్క,శ్రేయ వంటి హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పిన సునీత ఉత్తమ మహిళా డబ్బింగ్ ఆర్టిస్టుగా అవార్డు అందుకుంది.

హీరోయిన్ సమంత కు క్రేజ్ వచ్చిందంటే ప్రధాన కారణం ఆమెకి డబ్బింగ్ చెప్పిన చిన్మాయి వల్లే. ఏం మాయ చేసావే మూవీకి ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా నంది అవార్డు అందుకుంది చిన్మయి. అలానే తమిళం,కన్నడ ఇండస్ట్రీస్ లో చాలామందికి ఈమె డబ్బింగ్ చెబుతోంది.

Loading...