Friday, March 29, 2024
- Advertisement -

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమల లిస్ట్ ఇదే..!

- Advertisement -

బాల రామాయణం చిత్రంతో తెరంగేట్రం చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ఈరోజున పెద్ద స్టార్ అయ్యాడు. ‘స్టూడెంట్ నెంబర్ 1’ ‘ఆది’ ‘సింహాద్రి’ వంటి చిత్రాలతో తిరుగులేని మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఎన్ని పరాజయాలు ఎదురైనా ఏమాత్రం వెనుకడుగు వెయ్యకుండా లోపాలను తెలుసుకుని మళ్లీ హిట్స్ కొట్టాడు. అయితే ఎందుకో ఎన్టీఆర్ వదిలేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి కొన్ని ప్లాప్ అయ్యాయి. ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాలను ఓ లుక్కేద్దాం.

దిల్ : వినాయక్ డైరెక్షన్లో నితిన్ హీరోగా వచ్చిన ఈ సినిమా కోసం ముందు ఎన్టీఆర్ ను అప్రోచ్ అయ్యాడట వినాయక్. కానీ ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాడట. దాంతో నితిన్ కి సూపర్ హిట్ వచ్చింది.

ఆర్య : ఈ సినిమా కథను ప్రభాస్ రిజెక్ట్ చేస్తే ఎన్టీఆర్ చెప్పాడట సుకుమార్. అయితే అప్పట్లో ఎన్టీఆర్ కొంచెం బొద్దుగా ఉండటం వల్ల తాను ఈ క్యారెక్టర్ సెట్ అవ్వను అని వదిలేసాడట. దాంతో అల్లు అర్జున్ ఆర్య సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు.

అతనొక్కడే : ఈ చిత్రం కథను సురేందర్ రెడ్డి మొదట ఎన్టీఆర్ కు చెప్పగా అతను రిజెక్ట్ చేసాడట. తరువాత కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.

భద్ర : ఈ కథకి ఎన్టీఆర్ అయితే బెటర్ అని బోయపాటి శ్రీను చెప్పారట. కానీ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసాడు. తరువాత అల్లు అర్జున్ కు చెబితే అతను కూడా రిజెక్ట్ చేసాడు. చివరికి రవితేజ చెయ్యడం సూపర్ హిట్ అందుకోవడం జరిగింది.

కృష్ణ : ఈ సినిమా కథను కూడా ఎన్టీఆర్ రిజెక్ట్ చెయ్యడంతో వినాయక్ రవితేజ తో తీసి హిట్ కొట్టారు.

కిక్ : ఈ సినిమా కథని మొదట ప్రభాస్ కు చెప్పాడట సురేందర్ రెడ్డి. అతను నో చెప్పడంతో ఎన్టీఆర్ కు కూడా వినిపించాడట. ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడంతో రవితేజతో తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు సురేందర్ రెడ్డి.

ఎవడు : ఈ కథని ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు చేద్దాం అనుకున్నారట. కానీ ఎందుకో డ్రాప్ అయ్యారు. దాంతో రాంచరణ్, అల్లు అర్జున్ నటించి హిట్ కొట్టారు.

శ్రీమంతుడు : ఈ కథను ఎన్టీఆర్ కు చెప్తే రిజెక్ట్ చేసాడు. దాంతో ఈ సినిమాని మహేష్ బాబుతో తీసి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు కొరటాల శివ.

ఊపిరి : ఈ సినిమాలో నాగార్జున, కార్తీ ప్రధాన పాత్రల్లో నటించారు. కార్తీ పాత్రకు ముందుగా ఎన్టీఆర్ ను అనుకున్నాడు దర్శకుడు వంశీ. కానీ ఎన్టీఆర్ స్క్రిప్ట్ ల్లో మార్పులు కావాలి అన్నాడట. దాంతో ఇది కార్తీ వద్దకు వెళ్ళింది.

బ్రహ్మోత్సవం : దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మొదట ఈ కథని ఎన్టీఆర్ కు చెప్పాడు. కానీ ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడంతో మహేష్ ఈ సినిమా చేశాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయింది.

నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా : వక్కంతం వంశీ డైరెక్టర్ గా మారి అల్లు అర్జున్ తో చేసిన ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ కథని ఎన్టీఆర్ కు చెప్పాడు దర్శకుడు. అయితే అప్పటికే జై లవ కుశ ఓకే చేసి ఈ సినిమాని పక్కనపెట్టాడు ఎన్టీఆర్. దాంతో వంశీ ఈ సినిమాని అల్లు అర్జున్ తో తీశాడు.

శ్రీనివాస కళ్యాణం : దర్శకుడు సతీష్ వేగేశ్న, నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ముందుగా ఎన్టీఆర్ తో ప్లాన్ చేశారు. కానీ ఎన్టీఆర్ ఈ సినిమాని రిజెక్ట్ చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -