Thursday, April 25, 2024
- Advertisement -

‘అది రాజశేఖరరెడ్డి కుటుంబం…….. మాట తప్పదు, మడమ తిప్పదు’

- Advertisement -

ఎందుకు? ఎందుకు? ఎందుకు……….చంద్రబాబుతో సహా టిడిపి నాయకులు, బాబు భజన మీడియా సంస్థలు పదే పదే మధిస్తున్న ప్రశ్న అది. జవాబు మాత్రం దొరకడం లేదు. కానీ పచ్చ పార్టీ జనాల బుర్రలు మాత్రం మండు వేసవిని మించే మంటెత్తిపోతున్నాయి. అధికారంలో ఉన్నాం. వైకాపాతో సహా ఇతర ఏ పార్టీ దగ్గర కూడా లేనంత డబ్బు ఇప్పుడు టిడిపి నాయకుల దగ్గర ఉంది. న్యాయ వ్యవస్థను మేనేజ్ చేసే సత్తా ఇంకా ఉంది. అన్నింటికీ మించి సత్యహరిశ్ఛంద్రుడుని అబద్ధాలకోరు అని చెప్పి కూడా తెలుగు ప్రజలను నమ్మించగలం అనుకునే భజన మీడియా అండ ఉంది. పాకిస్తాన్ అధ్యక్షుడు శాంతి కాముకుడు, ఉగ్రవాదులతో సంబంధాలు లేవని చెప్తున్నాడు. ఆయన చెప్పిందే కరెక్ట్………..మోడీ యుద్ధోన్మాది. మోడీనే టెర్రరిస్టుల దాడి చేయించాడు అన్న అర్థం వచ్చేలా చంద్రబాబు, ఆ బాబుతో ప్యాకేజ్ రాజకీయం చేస్తున్న పవన్ కళ్యాణ్‌లు దారుణమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ ఆ ఇద్దరినీ గొప్ప నాయకులుగా, వాళ్ళ మాటలను అంతకంటే గొప్ప మాటలుగా పచ్చ మీడియా మేనేజ్ చేయలేదా?

అయినప్పటికీ నాయకులందరూ కూడా ఎందుకు వైకాపాలో చేరుతున్నట్టు. భారీ పారిశ్రామిక వేత్తలైన పివిపిలాంటి వాళ్ళు, ప్రజాదరణ మెండుగా ఉన్న తోట నరసింహంలాంటి వాళ్ళు……..ఇంకా విద్యావంతులు, మాజీ ఐఏఎస్‌లు, మేధావులు అందరూ కూడా ఈ సారి వైఎస్ జగన్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. అన్నింటికీ మించి ఎప్పుడూ టిడిపి వెంట నిలిచే సినిమా జనాలు కూడా ఈ సారి వైకాపాకే మద్దతిస్తున్నారు. అలీ లాంటి వాళ్ళు అయితే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే టిడిపిలో చేరతాను అని చంద్రబాబును కలిశారు. అయితే షరా మామూలుగానే ‘చూద్దాం……..చేద్దాం……..ముందు పార్టీలో చేరు’ అంటూ తన మార్క్ వెన్నుపోటు రాజకీయ బుద్ధితో చంద్రబాబు మాట్లాడడంతో ఆ మరుక్షణమే వైకాపాలో చేరాడు. ఇక్కడ ఆశ్ఛర్యకరమైన విషయం ఏంటంటే టికెట్ ఇస్తేనే టిడిపిలో చేరతాను అని చంద్రబాబుతో చెప్పిన అలీ………వైఎస్ జగన్‌ దగ్గర మాత్రం అలాంటి కండిషన్స్ ఏమీ పెట్టలేదు. ‘నీ భవిష్యత్ నాది……….కుటుంబ సభ్యుడిలా చూసుకుంటా’ అని చెప్పిన జగన్ మాటను నమ్మి వైకాపాలో చేరాడు.

అందుకే ఇప్పుడు చంద్రబాబు బ్యాచ్ అందరూ కూడా ఎందుకు? ఎందుకు? ఎందుకు వైఎస్ జగన్‌నే నమ్ముతున్నారు అని వేధనగా ప్రశ్నించుకుంటున్నారు. ఎన్నికలయ్యాక మద్దతిస్తా అని గడ్కరీ ద్వారా ఒక మీడియా మొఘల్‌తో మోడీకి రాయబారం పంపినప్పటికీ మోడీ, అమిత్ షాలు ‘ఇక ఎప్పటికీ బాబు మద్దతు తీసుకోం’ అని మొహం మీదే చెప్పేశారు. అలాగే జగన్‌కి సపోర్ట్ చెయ్యొద్దని చెప్పి కేేసీఆర్‌తో ఎన్ని రాయబేరాలు చేస్తున్నా కేసీఆర్ కూడా బాబును నమ్మడం లేదు. అందుకే ఇప్పుడు చంద్రబాబు అండ్ బ్యాచ్ అందరూ కూడా ఎందుకు? ఎందుకు? అందరూ జగన్‌నే నమ్ముతున్నారు అని ప్రశ్నించుకుంటున్నారు. ఆ ప్రశ్నకు సమాధానం చంద్రబాబు అండ్ బ్యాచ్, ఆయన భజన మీడియాకు తెలుసో తెలియదో కానీ తెలుగు ప్రజలందరికీ తెలుసు. దేశంలో ఉన్న నాయకులు అందరికీ తెలుసు. ఎందుకంటే…………‘అది రాజశేఖరరెడ్డి కుటుంబం…………..మడమ తిప్పదు……….మాట తప్పదు’. వెన్నుపోటు రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, వాడుకుని వదిలేసే రాజకీయాలు వైఎస్‌లు ఎప్పుడూ చెయ్యరు.

కేవలం ఐదేళ్ళ ముఖ్యమంత్రి పదవి కోసం సాధ్యం కావని తెలిసీ అన్నీ అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయడం, 2014లో మోడీ క్రేజ్‌తో గెలిచి, మోడీని దేవుడిగా కొలిచి…… ఆ తర్వాత 2018కల్లా ఆ క్రేజ్ మొత్తం పోయిందని భ్రమపడి అదే మోడీని దెయ్యం అని తిట్టి……దెయ్యం అని తిట్టిన సోనియాతో, సీమాంధ్రులకు తీరని ద్రోహం చేసిన కాంగ్రెస్‌తో కలిసి……. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయినప్పటికీ కాళ్ళ బేరానికి రావడం, హైదరాబాద్ వదిలి వెళతాననడంతో క్షమించి వదిలేశాడన్న కృతజ్ఙత కూడా లేకుండా అదే కేసీఆర్‌కి కూడా వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేసిన నీచ చరిత్ర వైఎస్‌లకు లేదు. అలాంటి అమానవీయ, రాక్షస రాజకీయాలు వైఎస్‌లు ఎప్పుడూ చేయరు. అందుకే ఇప్పుడు అందరూ వైఎస్ జగన్‌ని నమ్ముతున్నారు. వైఎస్‌ కుటుంబాన్నే ఎందుకు నమ్ముతున్నారు………..నన్ను ఎందుకు నమ్మరు అని అడుగుతున్న చంద్రబాబుతో ‘అది రాజశేఖరరెడ్డి కుటుంబం………….మడమ తిప్పదు……..మాట తప్పదు’ అని మొహం మీదనే చెప్పేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -