Thursday, April 25, 2024
- Advertisement -

విజ‌య‌వాడ‌లో వైసీపీ జెండా ఎగ‌ర‌డం క‌ష్ట‌మేనా…?

- Advertisement -

2019లో జ‌రిగే ఎన్నిక‌ల‌లో అధికార ల‌క్ష్యంగా ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ప‌ని చేస్తున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో ఈ సారి జ‌రిగే ఎన్నిక‌ల్లో సీఎం కావాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు జ‌గ‌న్‌. దీనిలో భాగంగానే ఎమ్మెల్యే అభ్య‌ర్ధుల ఎంపిక‌లో అచితూచి వ్య‌వ‌హారిస్తున్నారు. రాయ‌ల‌సీమ నాలుగు జిల్లాల్లో మూడు జిల్లాలు జ‌గ‌న్‌కు అనుకులంగా ఉన్నాయి. ఈసారి ఉత్తరాంధ్ర‌లో కూడా జ‌గ‌న్ త‌న ప్లాన్‌ను అమ‌లు చేయ‌నున్నారు. ఇక గోదావ‌రి జిల్లాల్లో కూడా స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టారు జ‌గ‌న్‌.

ఇక్క‌డికి బాగానే ఉంది కాని , ఏపీ రాజ‌ధాని అయిన విజ‌య‌వాడ‌లో మాత్రం వైసీపీ ప‌రిస్థితి అతంత‌మాత్రంగానే ఉంద‌ని తెలుస్తోంది. ఎమ్మెల్యే అభ్య‌ర్థులు బ‌లంగా ఉన్న‌ప్ప‌టికి కృష్ణజిల్లా ప‌రిధిలోని రెండు ఎంపీ సీట్ల‌కు అభ్య‌ర్ధులు క‌రువైయ్యారు. కృష్ణాజిల్లాలో రెండు పార్ల‌మెంట్ నియోజిక వ‌ర్గాలు ఉన్నాయి. విజ‌య‌వాడ పార్ల‌మెంట్ ఒక‌టి కాగా, రెండోది మ‌చిలీప‌ట్నం పార్ల‌మెంట్ సీటు. ఈ రెండు పార్ల‌మెంట్ సీట్ల‌కు ఇంత‌వ‌ర‌కు అభ్య‌ర్థుల‌ను ఫిక్స్ చేయ‌లేదు. పార్టీలో ఎవ‌రో ఒక‌రు చేర‌క‌పోరా వారికి సీటు ఇద్దామ‌నే ఆలోచ‌న చేస్తున్నాడ‌ట పార్టీ అధినేత‌. 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల‌లో కూడా ఇదే పొర‌పాటు చేశారు జ‌గ‌న్‌. విజ‌య‌వాడ ఎంపీ సీటుకు కోనేరు ప్ర‌సాద్ అనే వ్యాపారవేత్త‌ను తెర మీద‌కు తీసుకువ‌చ్చారు. అస్స‌లు ఆయ‌న ఎవ‌రో కూడా విజ‌య‌వాడ వాసుల‌కు కూడా తెలియ‌క‌పోవ‌డం వ‌ల్లే విజ‌య‌వాడ ఎంపీ సీటును కొల్పోవాల్సి వ‌చ్చింది.

ఇక మ‌చిలీప‌ట్నం ఎంపీ గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచింది. 2014లో మ‌చిలీప‌ట్నం నుంచి పోటీ చేయ‌డానికి అభ్య‌ర్థులే కురువైయ్యారు. అప్ప‌టిక‌ప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వ‌చ్చిన పార్థ‌సార‌థిని మ‌చిలీప‌ట్నం ఎంపీ నిల‌బెట్టిన ఫ‌లితం లేక‌పోయింది. 2019 ఎన్నిక‌లు వ‌చ్చిన ఈ రెండు పార్ల‌మెంట్ సీట్ల ప‌రిస్థితి మార‌లేదు. విజ‌య‌వాడ నుంచి ఎంపీగా ఎవ‌రు పోటీ చేస్తారో తెలియ‌ని ప‌రిస్థితి. ఇటీవ‌లే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన దాస‌రి జై ర‌మేష్ విజ‌యవాడ నుంచి పోటీ చేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే స‌మ‌యంలో పీవీపీ పేరు కూడా వినిపిస్తోంది. వ్యాపార‌వేత్త, సినీ నిర్మాత అయిన పొట్లూరి ప్ర‌సాద్ గ‌త ఎన్నిక‌ల‌లోనే విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేయ‌డానికి రెడీ అయిన‌ప్ప‌టికి సీటు ద‌క్క‌క‌పోవ‌డంతో పోటీ చేయాల‌నే ఆలోచ‌న‌ను విర‌మించుకున్నారు. ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న విజ‌య‌వాడ ఎంపీ టికెట్ రేసులో ఉన్నార‌ని తెలుస్తోంది. ఇక మ‌చిలీప‌ట్నం నుంచి పోటీలో బాల‌శౌరి పేరు వినిపిస్తోంది. బ‌ల‌మైన ఎంపీ అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టితేనే ఎమ్మెల్యే అభ్య‌ర్ధులు ఈజీగా విజ‌యం సాధిస్తారు. మ‌రి ఇప్ప‌టికి అయిన జ‌గ‌న్‌ ఎంపీ పేర్ల‌ను క‌న్ఫ‌ర్మ్ చేస్తాడో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -