Friday, March 29, 2024
- Advertisement -

27 కోట్ల విలువ సర్ధాజ్ దున్నపోతు.. ప్రత్యేకతలు ఇవే..!

- Advertisement -

దీపావళి పండుగ వేళ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సదర్ వేడుకలకు చారిత్రక భాగ్యనగరం సిద్దమైంది. అందంగా.. అద్భుతంగా రెడీ అయిన దున్నపోతులు సందడి చేయడానికి సిద్దమైయ్యాయి. సదర్ వేడుకను మహోన్నతమైన సాంస్కృతిక ఉత్సవంగా జరుపుకుంటారు. ఇది నిజాం కాలం నుండి ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న వేడుక. ఈ సారి ఉత్సవాల్లో దున్నపోతులు సందడి చేయనున్నాయి.

ముషీరాబాద్ లో జరిగే సదర్ ఉత్సవాలకు సర్దాజ్ అనే దున్నపోతు ప్రత్యేక ఆకర్షణ కానుంది. 16వందల కిలోల బరువు, 15 అడుగుల పొడవు ఉన్న ఈ సర్దాజ్.. విలువ 27 కోట్లు రూపాయలు. ప్రతి రోజు 15 కిలోల ఆపిల్ పండ్లు, 20 లీటర్లు పాలు, కిలో బెల్లం, రెండు కిలోల కంది పప్పు, శనగ పప్పు, బాదం, పిస్తా, ఎండు ద్రాక్షను సర్ధాజ్ కు పెడతారు. ఇక రాణా అనే దున్నపోతు కూడా సందడి చేయనుంది. ప్రముఖ దున్నపోతు సుల్తాన్ వారసత్వానికి చెందిన రాణా కు 3 నెలల వయసు ఉన్నప్పుడు 3 లక్షలు ఇచ్చి హర్యానాలో కొనుగోలు చేసినట్లు దాని యజమాని మధు యాదవ్ తెలిపారు.

నారాయణ గూడలోని ఉత్సవాల్లో రాణా తన విన్యాసాలతో ఆకట్టుకోనుంది. ఇక రాణా నుంచి సేకరించే వీర్యం ఎంతో విలువైనదని.. నెలకు మూడు లక్షల వరకు దీని సంపాదన ఉంటుందని తెలిపారు. రోజుకు ఇరవై లీటర్ల పాలు.. అరటి పండ్లు.. ఐదు కిలోల యాపిల్స్.. బాదం.. పిస్తా.. ఖర్జూరం వంటివి తింటుందని యాజమాని చెప్పారు. రాణా భోజనానికి రోజుకు నాలుగు నుంచి ఐదు వేల వరకు ఖర్చు వస్తుందని యజమాని చెప్పుకొచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -