Saturday, April 20, 2024
- Advertisement -

ఆట ఫేమ్ శ్రీవిద్యా ఇప్పుడు ఎలా ఉందో చూడండి

- Advertisement -

శ్రీవిద్య ఆట డాన్స్ రియాల్టీ షో ద్వారా అందరికీ సుపరిచితమే. ఆమె ఆటో షో ఎంట్రీ అప్పట్లో ఒక సంచలనం చెప్పవచ్చు. ఎందుకంటే సన్నగా ఉండే వాళ్ళు డాన్స్ చేయడం అనేది చాలా సహజమైన విషయం. కానీ ఈమె కాస్త బొద్దుగా ఉండి కూడా అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి జడ్జీస్ చేత.. షో చూసే ప్రేక్షకుల చేత కూడా ఔర అనిపించింది. కొరియోగ్రాఫర్ భరత్, ఆట యాంకర్ ఓంకార్ కూడా తనని చాలా ప్రోత్సహించారు.

ఉన్నత కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి తనని తాను కొత్తగా ఫ్రూవ్ చేసుకోవాలని చాలా కష్టపడి ఆఖరికి ఆటో షో విన్నర్ గా నిలిచింది. ఆట తర్వాత రైటర్ వక్కంతం వంశీ ని పెళ్లి చేసుకున్న శ్రీవిద్య పెళ్లి తర్వాత బయట ఎక్కడా కనిపించలేదు. కెరీర్ లో కొత్త బ్రేక్ తీసుకొని పాప పుట్టిన తర్వాత ముద్దమందారం సీరియల్ లో చంద్రముఖి క్యారెక్టర్ లో కొన్ని రోజులు కనిపించింది. ఆట షోలో శ్రీవిద్యను చూసినవారు.. చంద్రముఖిలో శ్రీవిద్యను చూసిన వారు ఆమె ఈమె ఒకరేనా అని ఆశ్చర్యపోయారు. చాలా డెడికేషన్ తో శ్రీవిద్య సన్నబడింది.

ఒక ప్రముఖ వెయిట్ లాస్ సంబంధించిన కమ్యూనుటీలో జాయిన్ అయ్యి వారు చెప్పిన డైట్ తో పాటు ఎక్సర్సైజ్ కూడా క్రమం తప్పకుండా పాటించదట. ఒకవైపు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ తన వెయిట్ లాస్ జర్నీని చాలా ఎడ్యుకేషన్ తో చేసిన శ్రీవిద్య ఎవరూ ఊహించనంతగా సన్నబడింది. అయితే మళ్లీ బాబు పుట్టాక బొద్దుగా కనపడిన శ్రీవిద్య ఇప్పుడు సరికొత్త అవతారంలో దర్శనం ఇచ్చింది.

న్యూ ఇయర్ పార్టీలో ఆమె చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఇలా ఎలా తగ్గారు మాకు చెప్పండి అంటూ ఆమె ఫొటోస్ కింద కామెంట్స్ పెడుతున్నారు కొందరు. మరికొందరు మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అంటూ కొనియాడుతున్నారు. లావుగా ఉంటే ఏం చేయాలేం అనుకునేవారు చాలా మంది ఉంటారు. కానీ లావు ఉన్నా సరే ఏదైన చేయొచ్చు అని ఆట విన్నర్ గా నిలిచి చుపించింది శ్రీవిద్య.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -