జగన్@ది బెస్ట్….. బాబు, కేసీఆర్‌‌లను మించిన మెచ్యూరిటీ చూపించాడుగా

7198
About YSRCP Chief YS Jagan Mohan Reddy Latest Interview
About YSRCP Chief YS Jagan Mohan Reddy Latest Interview

రాహుల్ 2.0, పరిణతి సాధించిన లోకేష్ అంటూ పచ్చ మీడియాలో వచ్చే తరహా స్టోరీ కాదిది. అలాగే అత్యంత అనుభవజ్ఙుడు అంటూ చంద్రబాబు కుటిల రాజకీయాలను ఆహా……ఓహో అని పొగిడే కార్యక్రమం కూడా కాదు. కానీ జగన్‌ మాటల్లో వచ్చిన మెచ్యూరిటీ మాత్రం ప్రజల కంటికి కనిపిస్తూనే ఉంది. ఈ విషయాన్ని తటస్థులు కూడా అంగీకరిస్తూ ఉన్నారు. మోడీని ఎందుకు తిట్టలేదు? కేసీఆర్‌ని ఎందుకు విమర్శించడం లేదు అంటూ అజ్ఙానంతో, అమాయకత్వంతో టిడిపి నాయకులు అడుగుతున్న ప్రశ్నలతో పాటు, ఆంధ్రప్రదేశ్ ప్రజల విషయంలో, అభివృద్ధి విషయంలో తనకు పూర్తిగా స్పష్టత ఉందని, పరిణతితో కూడిన ఆలోచనలు చేస్తున్నానని తాజాగా ఇచ్చిన ఇంటర్యూలలో స్పష్టంగా అర్థమయ్యేలా చేశాడు జగన్.

ఒకేసారి వందమంది అభ్యర్థులను ప్రకటించి రికార్డ్ సృష్టిస్తారట కదా అన్న ప్రశ్నకు ప్రజాభిమానం పొందే ప్రయత్నం చేయాలిగానీ ఈ రికార్డులు, ఆ రికార్డ్‌లు అంటూ మాట్లాడడం ఏంటి? అంటూ జగన్ తన పరిణతి ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేశాడు. అలాగే పవన్-చంద్రబాబుల పొత్తు గురించి, గెలుపు-ఓటముల గురించి కూడా జగన్ చెప్పిన మాటలు అందరి అభినందనలూ పొందేలా ఉన్నాయి. అధికారం లేకపోయినా ఫర్వాలేదు, రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కూడా రెడీ…కానీ మోసం చేసి, కుట్రలతో రాజకీయాలు మాత్రం చేయనని చెప్పడం జగన్, ఫిరాయింపుల విషయంలో కూడా పదవికి రాజీనామా చేసి వస్తేనే తీసుకుంటానని చెప్పిన మాటలు జగన్ ధైర్యాన్ని, నిజాయితీని స్పష్టం చేస్తున్నాయన్న మాటలు ప్రజల నుంచే వినిపిస్తున్నాయి. అన్నింటికీ మించి చంద్రబాబునాయుడు, పవన్, నరేంద్రమోడీ, రాహుల్, బిజెపి, కాంగ్రెస్‌ల రాజకీయాల గురించి, 2019 తర్వాత ఎక్కువ మంది ఎంపిలను గెలిస్తే కేంద్రంలో తాను అనుసరించబోయే వ్యూహం గురించి జగన్ చెప్పిన మాటలు చంద్రబాబుకంటే కూడా చాలా మెచ్యూర్డ్‌గా ఉండడం పరిశీలకులను కూడా ఆశ్ఛర్యపరుస్తోంది.

అనుభవం…….అనుభవం అని చెప్పుకుని అనునిత్యం అబద్ధాలతో చంద్రబాబు చేస్తున్న రాజకీయం పట్ల విసిగిపోయి ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ రూపంలో ఒక మంచి ప్రత్యామ్నాయం కనిపిస్తోందని కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి తన అనుచరులతో వ్యాఖ్యానించడం జగన్‌ పరిణతిని సూచిస్తోందని సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు. 2019 ఎన్నికల్లో గోబెల్స్ ప్రచారాలను, గ్రాఫిక్స్ జిమ్మిక్కులను కాకుండా కంటికి కనిపిస్తున్న నిజాలను, గత పదేళ్ళ నుంచీ చంద్రబాబు, జగన్‌ల వ్యవహార శైలిని, మాటలను పరిగణనలోకి తీసుకుని ఓటు వేశారంటే మాత్రం జగన్ తిరుగులేకుండా అధికారంలోకి రావడం ఖాయం అన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.