మురళి శర్మ ఫ్యామిలీని ఎప్పుడైన చూశారా ?

4165
Actor Murali sharma real life and family moments
Actor Murali sharma real life and family moments

మురళి శర్మ గారు ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న అతి కొద్ది మంది సపోర్టింగ్ యాక్ట్రెస్ లో ఆయనొకరు. రీసెంట్ గా ఆయన నటించిన అల వైకుంఠపురములో చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ మూవీలో మురిళి శర్మ గారు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు మురళి శర్మ గారి గురించి ఆయన ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. శర్మ గారు ఆగస్టు 19 1972లో ముంబై లో జన్మించారు. కానీ ఆయన స్వస్థలం గుంటూరు.

ఆయనకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. శర్మ గారు హిందీ టెలివిజన్ యాక్ట్రెస్ అశ్వినీని ప్రేమించి 2009లో పెళ్లి చేసుకున్నారు. ఆమెకు ఇది రెండో వివాహం. ముంబై లో పుట్టి పెరిగిన శర్మ గారు అక్కడే తన డీగ్రీని కంప్లీట్ చేశారు. చదువుకుంటూ నాటకాలు వేసేవారు. డిగ్రీ కంప్లీట్ అయ్యాక టెలిఫోన్ ఆపరేటర్ గా, పార్ట్ టైం జర్నలిస్ట్ గా కూడా జాబ్ చేశారు ఆయన. ఆయనకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఇష్టం ఉండడంతో రోషన్ తానేజా ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు. అక్కడ ఏర్పడిన పరిచయాల వల్ల హిందీ సీరియల్స్ లో నటించారు. ఆ తర్వాత హిందీలో ఓ చిత్రంలో శర్మ గారు నటించారు.

ఇక అక్కడినుంచి ఆయన వెనుతిరిగి చూసుకోలేదు. మన తెలుగు డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు పులి శర్మగారి కొన్ని హిందీ మూవీస్ పర్ఫామెన్స్ చూసి ముంబై వెళ్ళినప్పుడు మురళీ శర్మ గారిని కలిసి మాట్లాడి అతిథి మూవీ లో ఛాన్స్ ఇచ్చారు. తెలుగులో నటించిన మొదటి సినిమాకే ఆయనకు నంది అవార్డు కూడా అందుకున్నారు. ఇక అక్కడినుండి తెలుగులో దాదాపు 20కి పైగా సినిమాలలో నటించి తన చక్కని నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయనకి తెలుగులో ఇంకా మంచి అవకాశాలు రావాలని నటుడిగా ఇంకా ఎంతో సక్సెస్ అందుకోవాలని కోరుకుంటూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం.

Loading...