టీచర్ ను పెళ్లి చేసుకున్న భూమిక..!

1480
actress bhumika chawla love story
actress bhumika chawla love story

కరుణా కరణ్ డైరెక్షన్లో తెరకెక్కిన యువకుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది భూమిక. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే తర్వాత చేసిన ’స్నేహమంటే ఇదేరా’, ’వాసు’ సినిమాలు పెద్ద ఆడలేదు. మహేష్ తో చేసిన ఒక్కడు, ఎన్టీఆర్ తో చేసిన సింహాద్రి సినిమాలు ఈమెను స్టార్ హీరోయిన్ ను చేశాయి.

ఆ తర్వాత ‘సాంబ’ ‘జై చిరంజీవ’ చిత్రాలు నిరాశపరచడం.. కొత్త హీరోయిన్స్ రావడంతో భూమిక డిమాండ్ తగ్గిపోయింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ‘ఎం.ఎస్.ధోని’ ‘ఎం.సి.ఎ’ ‘సవ్యసాచి’ ‘రూలర్’ వంటి చిత్రాల్లో నటించింది. ఇది ఇలా ఉంటే భూమిక 2007లో భరత్ ఠాకూర్‌ను పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిది ప్రేమ వివాహం అన్న విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.

విషయంలోకి వెళ్తే.. భరత్ ఠాకూర్ మరెవరో కాదు.. భూమికకు యోగా టీచర్. వీరి పరిచయం ప్రేమగా మారిన తరువాత నాలుగేళ్ళ పాటు డేటింగ్ చేసారట. అటూ తర్వాతే పెళ్ళి చేసుకున్నారని తెలుస్తుంది. 2014లో వీళ్లకు ఓ బాబు పుట్టాడు.అతని పెరు యష్.’టీచర్ ను పెళ్లి చేసుకున్నారు ఏంటి?’… అని భూమికను ప్రశ్నిస్తే… ‘మా ఇద్దరి మనసులు కలిసాయి. అయినా భరత్ నాకు స్కూల్లో టీచర్ కాదు.. యోగా క్లాస్ టీచర్. అందులో తప్పేమీ లేదు’ అంటూ చెప్పుకొచ్చింది భూమిక.

మెగాస్టార్ చిరంజీవి వదిలేసిన సినిమాలు ఇవే..!

మెగాస్టార్ వాడే కార్లు ఇవే.. వాటి ధర ఎంతంటే ?

మన స్టార్ హీరోలకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా ?

సొంత సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న మన హీరోలు వీరే..!

Loading...