దోసలు అమ్ముకుంటున్న సీరియల్ నటి.. ఎందుకు ?

4215
Actress Kavitha Lakshmi becomes a street vendor
Actress Kavitha Lakshmi becomes a street vendor

టాలీవుడైన కోలీవుడైన.. ఎక్కడైన స్టార్ హీరోయిన్ల లైఫ్ టైమ్ తక్కువ. ఇక మిగిత సాధరణ నటీమణుల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందులోనూ సీరియల్స్ లో నటించేవారి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని చెప్పాలి. హీరోయిన్లు, మెయిన్ ఆర్టిస్ట్ లకు ఇచ్చినంత పేమెంట్లు వీరికి ఇవ్వరు.

అందుకేనేమో ఓ సీరియల్ నటి ప్రస్తుతం దోసలు వేసుకుంటుంది. ప్రస్తుతం ఈ టాపిక్ బాగా వైరల్ అయింది. అయితే ఈమెను ట్రోల్ చేయడం లేదు.. ఈమెకు హ్యాట్సాఫ్ చెబుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అవకాశాల కోసం తప్పుడు దారిలో వెళ్లే నటీమణులు మనం నిత్యం వార్తల్లో చూస్తునే ఉన్నాం. కానీ ఈమె మాత్రం కష్టపడి పనిచేస్తుంది అంటూ చెప్పు కొస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ ఈమె ఎవరంటే.. మలయాళం లో ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సీరియల్ ఆర్టిస్ట్ కవితా లక్ష్మి.

తన పిల్లల్ని చదివించుకోవడం కోసం నటిస్తూనే.. మరో పక్క ఇలా దోసలు వేసుకుంటూ సంపాదిస్తోంది. 13 ఏళ్ల క్రితమే తన భర్త నుంచి విడాకులు తీసుకున్న ఈమె తన ఇద్దరి పిల్లలను చదివించుకోవడం కోసం ఎంతో కష్టపడుతుంది. ఈమె ఎంతో గొప్ప నటి కాబట్టి ఉదయం .. మధ్యాహ్నం సమయంలోనే దర్శక నిర్మాతలు షూటింగ్ లు ఫినిష్ చేస్తారట. ఆ తర్వాత హై వే పక్కన దోసల డ్యూటీ ఎక్కుతోందట. ఈ స్టోరీ విని చాలా మంది ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Loading...