Wednesday, April 24, 2024
- Advertisement -

నువ్వొస్తానంటే నేనొద్దంటానా సంతోషి ఇప్పుడు ఏం చేస్తుందంటే ?

- Advertisement -

ఎంతో మంది నటీనటులు ఒకటి రెండు సినిమాల్లో నటించి ఆ తర్వాత ఆఫర్స్ రాకో లేక ఫ్యామిలీ కోసమో సినిమాలకు గుడ్ బై చెప్పేస్తారు. కానీ వాళ్లు అలా ఒకటి రెండు చేసిన పాత్రలైనా అవి ఎప్పటికీ జనాల మధ్య అలా ఉండిపోతాయి. జై ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి సంతోషి.

తర్వాత హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు రాకపోయినా నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో శ్రీహరి ఇంట్లో పనిమనిషిగా జాగ్రత్త అనగానే చేతిలో ఉన్న వాటిని పడేస్తూ అందర్ని నవ్విచింది. ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఢీ చిత్రంలో మరోసారి పనిమనిషి క్యారెక్టర్ లో అలరించింది. ఈ రెండు సినిమాలలో ఆమె ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సంతోషి ఇప్పుడు ఏం చేస్తుంది ఎలా ఉందో చూద్దాం.

సంతోషి స్వస్థలం చెన్నై. ప్రస్తుతం ఆమె చెన్నైలో బ్యూటీ ప్లస్ పేరుతో మేకప్ స్టూడియో తో పాటు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ డ్రెస్ డిజైనర్ కూడా రాణిస్తుంది. ప్రస్తుతం చెన్నైలో వన్ ఆఫ్ ద బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ గా కెరీర్ లో సక్సెస్ అయింది సంతోషి. ఈమెకు 2011లో స్వీకర్త వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. ఒకవైపు తన ఫ్యామిలీ చూసుకుంటూ ఇంకోవైపు తన కెరీర్ను చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -