Thursday, April 18, 2024
- Advertisement -

నటి సురేఖ వాణి కూతురుని చూశారా ?

- Advertisement -

సుప్రీత నాయుడు ఈ పేరు పెద్దగా ఎవరికీ పరిచయం లేదు కానీ సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉండే వాళ్ళకి టిక్ టాక్ చేసే వాళ్లకు మాత్రం ఐడియా ఉంటుంది. సుప్రీతా ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి గారి అమ్మాయి. 19 సంవత్సరాలకి తల్లికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి నేను ఉన్నానమ్మ అంటూ పక్కనే నిల్చుని చాలా సపోర్ట్ చేస్తుంది సుప్రీతా.

సురేఖ వాణి భర్త సురేష్ తేజ ఈ మధ్యనే మరణించిన సంగతి తెలిసిందే. సురేష్, సురేఖ వాణిలకు ఒక్కతే అమ్మాయి కావడంతో తనే కొడుకుగా తన తండ్రికి తలకొరివి కూడా పెట్టింది. ఆ టైంలో సోషల్ మీడియాలో చాలా నెగిటివిటిని ఎదుర్కుంది. ఆ నెగిటివిటిని కూడా చాలా స్ట్రాంగ్ గా ఎదుర్కొని అందరికీ సమాధానం ఇచ్చింది. మా జీవితాల్లో మేము ఎంత సఫర్ అవుతున్నామో అనేది నీకు తెలీదు అంటూ ఎమోషనల్ మెసేజెస్ కూడా పోస్ట్ చేసింది.

టైం ఉన్నప్పుడు అలా తన తల్లితో కలిసి వెకేషన్ కి వెళ్తూ ఆమెతో సరదగా గడుపుతుంది సుప్రీత. ఇప్పుడు సుప్రీత చదువుకుంటూ మరోవైపు వెబ్ సీరీస్ లో నటిస్తోంది. ఆమె చేసిన కొన్ని ఎపిసోడ్స్ యూట్యూబ్ లో ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. సురేఖవాణి గారు నటిగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె కూతురు కూడా తనకు ఇష్టమైన కెరీర్ లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -