Saturday, April 20, 2024
- Advertisement -

బ్లాక్ బస్టర్ అని నమ్మించే ప్రయత్నం బూమరాంగ్….. ‘హలో’కి పెద్ద కష్టమే వచ్చిపడిందే

- Advertisement -

మెయిన్‌స్ట్రీమ్ మీడియా ఉన్నంత కాలం సినిమా స్టార్ హీరోల ఆటలు బాగానే సాగాయి. అప్పటి సినిమా మేగజైన్స్ కూడా స్టార్ హీరోలకు, స్టార్ డైరెక్టర్స్‌కి బాకాలు ఊదడం తప్ప నిజాలు చెప్పింది ఎప్పుడూ లేదు. అయితే సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. స్టార్ హీరోల సినిమా కలెక్షన్స్ కూడా మూడు రోజులకే పరిమితమవుతున్నాయి. కంటెంట్ ఉంటే మాత్రం అర్జున్‌రెడ్డిలా ఆకాశమే హద్దు అన్న స్థాయిలో చిన్న బడ్జెట్ సినిమాలు కూడా కలెక్షన్స్ కుమ్మేస్తున్నాయి. ఆ విషయం సినిమా ఇండస్ట్రీకి కూడా అర్థమయ్యింది కాబట్టి ఇండస్ట్రీ జనాలు కూడా ఇప్పుడు కథల చుట్టూ తిరుగుతున్నారు. ఆ విషయం తెలుసుకోలేకపోతున్న పవన్ కళ్యాణ్, సునీల్‌లాంటి హీరోలు మాత్రం రొటీన్ కథలు, రొటీన్ హీరోయిజంతో పల్టీలు కొడుతూ ఉన్నారు. ఇప్పుడు నాగార్జున కూడా అదే బాటలోనే నడుస్తున్నాడా అన్న అనుమానాలను తాజాగా ఆయనే రేకెత్తించాడు. మొదటి సినిమా ‘అఖిల్‌తోనే స్టార్ హీరో….అది కూడా మాస్ హీరో అయిపోవాలనుకున్నాడు అఖిల్. అయితే ఆ ప్రయత్నం కాస్తా బెడిసికొట్టి మొదటికే మోసం తెచ్చిపెట్టింది. ఇక రెండో సినిమాకు వేరే ప్రొడ్యూసర్ అయితే భారీగా ఖర్చుపెట్టే అవకాశం లేదు కాబట్టి తానే రంగంలోకి దిగాడు. అలాగే మనం లాంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్‌ని డైరెక్టర్‌గా ఫైనల్ చేశాడు. అఖిల్ సినిమా అట్టర్‌ఫ్లాప్ అయ్యాక ప్రపంచాన్ని ఉద్ధరించే కథ కాకుండా ప్రేమించిన అమ్మాయి కోసం ఫైట్ చేసే ప్రేమికుడి కథ అయితే అఖిల్‌కి బాగుంటుందన్న నాగ్ మాటల నుంచే విక్రమ్ కుమార్ కథ అల్లుకున్నాడు. నాగార్జున కూడా భారీ బడ్జెట్ పెట్టాడు.

అయితే బిజినెస్ దగ్గరకు వచ్చేసరికి ఎవరూ కూడా నాగ్ చెప్పిన రేట్లకు ముందుకు రావడం లేదు. దాంతో బయ్యర్స్‌ని, డిస్ట్రిబ్యూర్స్‌ని నమ్మించడంతో పాటు ప్రేక్షకుల్లో కూడా క్రేజ్ తీసుకురావడం కోసం ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో రెచ్చిపోయి మాట్లాడేశాడు నాగ్. భారీ బ్లాక్ బస్టర్ ఖాయం……ఇది ఫిక్స్ అని భారీ స్టేట్‌మెంట్స్ ఇచ్చేశాడు. అఖిల్ సినిమా ట్రైలర్ విక్రమ్ కుమార్ స్థాయిలో లేదన్న విమర్శలున్నాయి. మరీ ముఖ్యంగా ఎమోషన్ మిస్సయ్యిందన్న కంప్లైంట్ ఉంది. ఇక అఖిల్ కూడా స్టార్ హీరోలా ఫీలవుతూ …..నేనో స్పెషల్ స్టార్ హీరోని అని అనుకుంటూ స్టార్ హీరోలలా యాక్ట్ చేయడానికి ట్రై చేశాడు. నిజానికి ‘హలో’ సినిమాలో క్యారెక్టర్ కంటే కూడా సినిమా టీజర్స్, ట్రైలర్‌లో అఖిలే ఎక్కువ కనిపిస్తున్నాడు. అన్నీ కూడా బ్రహ్మాండంగా చే్స్తున్నాను అనే ఆలోచనలతో …..కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే యాక్ట్ చేసినట్టుగా కనిపిస్తోంది. అందుకే ఎక్కడా ‘హాలో’ సినిమాలోని క్యారెక్టర్ కనిపించడం లేదు. ఇక ఇప్పటి వరకూ విక్రమ్ కుమార్ తీసిన కథలన్నీ కూడా చాలా చాలా ప్రత్యకంగా ఉన్నాయి.

అయితే ఈ సారి మాత్రం ‘కహోనా ప్యార్ హై’ లాంటి పరమ రొటీన్ లవ్ స్టోరీని తెరకెక్కించబోతున్నాడన్న విషయం తెలుస్తూనే ఉంది. అయితే మొబైల్స్‌తో కథను ఎలా లింక్ చేశాడన్నదే ఇంట్రెస్టింగ్ పాయింట్. అయితే ఎంతైనా కథ మొత్తం రొటీన్ అన్న విషయం తెలిసిపోతూనే ఉంది. కథ రొటీన్ అన్న విషయాన్ని అఖిల్ కూడా ఒప్పుకున్నాడు. ఇన్ని డ్రా బ్యాక్స్ ఉన్న నేపథ్యంలో హలో సినిమాను నాగ్ చెప్పిన రేట్లకు కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అందుకే బ్లాక్ బస్టర్ ఖాయం అంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు నాగ్. అయితే అదంతా కూడా పబ్లిసిటీ స్టంటే అనే విషయం అర్థమయ్యేలాగ కాస్త ఓవర్‌గా స్పందించాడు నాగ్. తన సినిమాల విషయంలోనూ, చైతన్య విషయంలోనూ చాలా హుందాగా, నిజాయితీగా మాట్లాడే నాగ్ అఖిల్ సినిమాల దగ్గరకు వచ్చే సరికి ఎక్కువ ఎమోషన్ అవుతున్నాడు. ఓవర్ ది బోర్డ్ వెళ్ళిపోతున్నాడు. అందుకే నాగ్ పబ్లిసిటీ కాస్తా అనుమానాలు పెంచేలా తయారవుతుంది. ఆడియో రిలీజ్ ఫంక్షన్ సాక్షిగా విక్రమ్ కుమార్‌ని మరో సినిమాకు బుక్ చేస్తూ నాగ్ చేసిన స్టంట్ పైన కూడా విమర్శలే వస్తున్నాయి. మరి పబ్లిసిటీ పరంగా అయితే నాగ్ ఓవర్ యాక్షన్ బూమరాంగ్ అయింది. రేపు హలో సినిమా హిట్టయ్యి నాగ్ బ్లాక్ బస్రర్ మాటల పరువు నిలబెడుతుందో……..లేకపోతే మరో అఖిల్ అవుతుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -