డాడీ, గంగోత్రి కంటే ముందే బన్నీ సినిమాలు చేశాడు.. అవేంటంటే ?

581
allu arjun childhood movies goes viral in social media
allu arjun childhood movies goes viral in social media

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి అన్న విషయం అందరికి తెలిసిందే. అంతకంటే ముందు డాడీ సినిమాలో కనిపించాడు. అయితే డాడీ సినిమాలో ఒక చిన్న డ్యాన్సర్ గా కనిపించడం కంటే ముందు రెండు సినిమాల్లో బన్నీ బాల నటుడిగా కనిపించాడు. 1985లో వచ్చిన విజేత సినిమాలో మెగాస్టార్ మేనల్లుడిగా కనిపించాడు.

ఇక ఆ తరువాత 1986లో కమల్ హసన్, కె.విశ్వనాథ్ కాంబినేషన్ లో వచ్చిన స్వాతిముత్యం సినిమాలో కూడా బన్నీ స్పెషల్ అప్పిరియన్స్ ఇచ్చాడు. స్వాతిముత్యంలో కమల్ హాసన్ మనవళ్లలో ఒకడిగా ఒక చిన్న షాట్ లో కనిపించాడు. ఆ విధంగా బన్నీ నేటితరం యువ హీరోల కంటే ముందే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక గంగోత్రి కమర్షియల్ గా కొంత సక్సెస్ అయినప్పటికీ బన్నీ నటనపై కొన్ని సెటైర్స్ వచ్చాయి.

కానీ సెటైర్స్ కౌంటర్ ఇచ్చేలా ఆ తరువాత బన్నీ చేసిన సినిమాలు ఇండస్ట్రీలో అతనికి క్రేజ్ ని తెచ్చిపెట్టాయి. ఇటీవల వచ్చిన అల..వైకుంఠపురములో సినిమాతో 150కోట్లకు పైగా షేర్స్ అందించిన హీరోగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక నెక్స్ట్ ఈ స్టార్ హీరో పుష్ప అనే పాన్ ఇండియా సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

బుల్లితెర హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా ?

‘కార్తీక దీపం’ వంటలక్క గురించి షాకింగ్ నిజాలు..!

40 ఏళ్ళ దాటుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

అన్నవరంలో పవన్ చెల్లెలుగా నటించిన సంధ్య గుర్తుందా ?

Loading...