అమల గురించి లైఫ్ సీక్రెట్స్..!

- Advertisement -
  • అమల తల్లి ఐర్లాండ్‌ దేశస్థురాలు. తండ్రి బంగ్లాదేశ్‌కు చెందినవారు. వీరిది ప్రేమ పెళ్లి. వీరు పశ్చిమ బెంగాల్‌ ల్లో స్థిరపడ్డారు. అమల కలకత్తా లో పెరిగారు.
  • అమలకు చిన్నప్పటి నుంచే డ్యాన్స్ అంటే ఇష్టం. దీంతో ఆమె రుక్మిణిదేవి అరుంగళ్‌ అనే ఫేమస్‌ ఆర్టిస్ట్‌ స్థాపించిన ఇన్‌స్టిట్యూట్‌లో భరతనాట్యం అభ్యసించారు. ఇండియాతో పాటు విదేశాల్లోను నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.
  • దర్శకుడు టి.రాజేందర్‌ తన సినిమాలో క్లాసికల్‌ డ్యాన్సర్‌ హీరోయిన్‌ కోసం వెతుకుతుంటే అమల కనిపించారు. అలా ఆమెకు మైథిలి సినిమాలో ఛాన్స్ వచ్చింది. అలా 1986 లో తమిళ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
  • ఐదు భాషల్లో అమల సినిమాలు చేశారు. తమిళంలో 22, కన్నడం 5, మళయాలంలో 2, తెలుగులో 10, హిందీలో 8 చిత్రాల్లో నటించారు.
  • నాగార్జున సరసన అమల ’కిరాయి దాదా’ సినిమాలో మొదటి సారి నటించారు. ఆ తర్వాత చిన్నబాబు, శివ, ప్రేమ యుద్ధం, నిర్ణయం చిత్రాలలో కలిసి నటించారు.
  • 1991లో నాగార్జున ‘మనం పెళ్లి చేసుకుందాం’ అని అమలను అడిగేసరికి ఆమె ఆశ్చర్య పోయింది. తర్వాత కొంతకాలం ఇద్దరు ఒకరినొకరు అర్ధం చేసుకున్న తర్వాత 1992 లో పెళ్లి చేసుకున్నారు.
  • పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన అమల.. స్టార్ విజయ్ తమిళ ఛానల్ వాళ్లు నిర్వహించిన “సూపర్ మామ్” షో కి జడ్జిగా వ్యవహరించారు.
  • మళ్లీ 2012లో శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ సినిమాతో అమల సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకి గానూ ఉత్తమ నటిగా సినీ‘మా’ అవార్డ్‌ను అందుకున్నారు.
  • నాగార్జున ఇచ్చిన సలహాతో హైదరాబాద్‌లో మూగజీవాల రక్షణ కోసం బ్లూక్రాస్‌ సంస్థను అమల ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా ఇప్పటివరకు 4 లక్షలకుపైగా మూగజీవాలను సంరక్షించారు. ప్రస్తుతం అన్నపూర్ణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా బాధ్యతలు అమల పర్యవేక్షిస్తున్నారు.
  • అమల ఉదయం లేవగానే వాకింగ్ కి వెళుతారు. యోగ తప్పనిసరి. అప్పుడప్పుడు జిమ్ లో తేలిక పాటి ఎక్సర్‌సైజ్‌లు చేస్తారు. ఆహార నియమాల్లో స్వీట్స్‌ కి దూరంగా ఉంటారు.

ఇండస్ట్రీలో పవన్ ప్రాణమిత్రులు ఎంత మంది ఉన్నారో తెలుసా ?

ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఎన్నో తెలుసా ?

- Advertisement -

ఈ హీరోయిన్స్ చిన్నప్పటి నుంచే సినిమాలు చేస్తున్నారు..!

పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన సినిమాలు ఇవే..!

Most Popular

Related Articles

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి నో ఎలిమినేషన్..?

బిగ్ బాస్ నాలుగో సీజన్ లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే డేంజర్ జోన్ లో ఇద్దరు సభ్యులు ఉన్నారు. మోనాల్...

అమ్మ రాజశేఖర్ గుండు చూసి అతని భార్య ఏమన్నాదో తెలుసా ?

డాన్స్ కొరియోగ్రాఫర్ గా అమ్మరాజశేఖర్ అందరికి తెలుసు. ప్రస్తుతం ఇతను బిగ్ బాస్ నాలుగో సీజన్ లో ఒక సభ్యుడిగా ఉంటూ అందర్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. దాంతో అమ్మ రాజశేఖర్...

రెండేసి పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు వీరే..!

1) ఎన్టీఆర్: నందమూరి తారక రామారావు…1942లో మేనమామ కుమార్తె బసవతారకాన్ని వివాహం చేసుకున్నారు. ఆమె క్యాన్సర్‌తో మరణించడంతో ఒంటరైన రామారావు 1993లో లక్ష్మీపార్వతిని రెండో పెళ్లి చేసుకున్నారు.
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...