మళ్ళీ అమెజాన్ ప్రభంజనం.. దసరా ఆఫర్స్..!!

511
amazon india offers for dussera
amazon india offers for dussera

ఆన్ లైన్ రోలింగ్ దిగ్గజం మరోసారి భారీ ఆఫర్స్ ని ఇవ్వడానికి సిద్ధమవుతుంది.. ఇటీవలే ఓ భారీ సేల్ మేళా ని నిర్వహించిన అమెజాన్ ఇప్పుడు పండగ వేళా ప్రజలను ఆకట్టుకోవడానికి మళ్ళీ ఆఫర్స్ ని రిలీజ్ చేస్తుంది.. ‌న క‌స్ట‌మ‌ర్ల‌కు మ‌రింత వేగంగా డెలివ‌రీ చేసేలా కొత్త‌గా మ‌రో ఐదు కేంద్రాల‌తో త‌న నెట్ వ‌ర్క్ ను విస్త‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. డెలివ‌రీ వేగం, క‌నెక్టివిటీని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని, మెట్రో న‌గ‌రాల‌తో పాటు ఇత‌ర ప్రాంతాల‌కు మ‌రింత వేగంగా త‌మ సేవ‌లు అందుబాటులో ఉంటాయ‌ని ప్ర‌క‌టించింది.

విశాఖపట్నం, ఫరూఖ్ నగర్, బెంగుళూరు, అహ్మదాబాద్, ముంబై న‌గ‌రాల్లో వీటిని ప్రారంభించనుంది. ఇక ఇప్ప‌టికే ఉన్న‌ ఎనిమిది సార్టింగ్ గిడ్డంగులను కూడా విస్తరిస్తున్నట్లు తెలిపింది, కొత్త కేంద్రాలతో పాటు, అమెజాన్ ఇండియా 19 రాష్ట్రాలలో మొత్తం సార్టింగ్ ప్రాంతాన్ని 2.2 మిలియన్ చదరపు అడుగులకు పెంచుతుంది.

ఈ కేంద్రాల‌న్నీ ప్యాకేజీల‌ను తీసుకోవ‌టం, స్థానిక డెలివ‌రీ పాయింట్ల‌కు త‌ర‌లించేందుకు ఉప‌యోగ‌ప‌డ‌నున్నాయి. వీటి వ‌ల్ల స్థానికంగా వంద‌లాది కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయ‌ని, స్థానికుల‌కే పెద్ద‌పీట వేయ‌నున్న‌ట్లు అమెజాన్ అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

Loading...