యాంకర్ ప్రదీప్ కి పెళ్లి.. పెళ్లి కూతురేవరంటే..?

1170
Anchor Pradeep Machiraju Marriage Fixed
Anchor Pradeep Machiraju Marriage Fixed

బుల్లితెరపై రాణిస్తున్న యాంకర్ ప్రదీప్ కి ఫాన్స్ ఎక్కువమంది ఉంటారు.. ఎంతో చలాకి తనంగా ఉండే ప్రదీప్ సినిమాల్లో కూడా చేస్తూ రెండు స్క్రీన్ లలో అభిమానులను సంపాదించుకుంటున్నారు.. ఏ ఛానల్ లో చూసినా యాంకర్ ప్రదీప్ కనిపిస్తుంటాడు.. మ‌రోవైపు వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రదీప్.. ఇప్పటికే ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాను కంప్లీట్ చేశాడు. మున్నా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రదీప్‌ సరసన అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా నటించింది.

అయితే ఇప్ప‌టికే ఈచిత్రం విడుద‌ల కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా ఆగిపోయింది. ఇదిలా ఉంటే..మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ఉన్న ఈ స్టార్ యాంకర్ త్వ‌ర‌లోనే పెళ్లి కొడుకు కాబోతున్నాడు. గ‌తంలో చాలా సార్లు ప్ర‌దీప్ పెళ్లి వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. కానీ, ఈ సారి మాత్రం నిజంగానే ప్ర‌దీప్ ఓ ఇంటివాడు అవుతున్నట్లు వార్తలు వ‌స్తున్నాయి.

టీడీపీకి చెందిన ఓ బడా రాజకీయ నాయకుడి కుమార్తెతో ప్రదీప్ మ్యారేజ్ ఫిక్స్ అయిందని, కాకపోతే దాన్ని ర‌హ‌స్యం గానే ఉంచారని అంటున్నారు. అంతేకాదు, మ‌రో రెండు, మూడు నెలల్లోనే ప్ర‌దీప్ పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కుటుంబం పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉందని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది.

Loading...