Friday, March 29, 2024
- Advertisement -

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నాయకుడు వద్దు…. జగన్ రావాలిః ఎపి పబ్లిక్ పల్స్

- Advertisement -

డ్వాక్రా సంఘాలు చంద్రబాబు, జగన్‌లలో ఎవరి నాయకత్వాన్ని కోరుకుంటున్నాయి? విశ్వసనీయత విషయంలో బాబుకంటే జగన్ ఏ స్థాయిలో ముందున్నాడు? ఎపి వ్యాప్తంగా రెండు దఫాలుగా జరిపిన భారీ సర్వేలో వెల్లడైన మరికొన్ని ఫలితాలు ఏంటో చూద్దామా?

బై బై బాబు చెప్పే టైం వచ్చేసింది అని ఇప్పుడు మరో సర్వేలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పష్టంగా అభిప్రాయపడ్డారు. నిజానికి 2014 ఎన్నికల్లోనే ఇంటికి పోవాల్సిన చంద్రబాబు ఇంటికి వెళ్ళి మరీ పవన్‌ని బతిమాలుకుని, మోడీతో పోత్తు కోసం అన్ని రకాలుగానూ తగ్గి……అలాగే అలవికాని ఆరువందల హామీలతో స్వల్ప ఆధిక్యతతో ఒంటిరిగా పోటీచేసిన జగన్‌పై గెలిచాడు. అయితే ఐదేళ్ళ చంద్రబాబు పాలన చూసిన ప్రజలు ఇప్పుడు టిడిపి నేతలను ఏవగించుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని ఈ సర్వే తేల్చి చెప్పింది. దేశంలోనే ప్రాముఖ్యత ఉన్న ఈ సంస్థ ఏడు లక్షలమంది శాంపిల్స్‌తో రెండు విడతలుగా భారీ సర్వే నిర్వహించింది. డ్వాక్రా సంఘాల వాళ్ళు కూడా చంద్రబాబు కంటే జగన్‌ నాయకత్వమే రాష్ట్రానికి అవసరం అని భావిస్తున్నారు. అలాగే పచ్చ మీడియాతో సహా చంద్రబాబు నుంచీ టిడిపి నాయకులందరిపై ప్రజల్లో తీవ్రస్థాయి వ్యతిరేకత ఉందని ఈ సంస్థ తేల్చి చెప్పింది.

అబద్ధాలతో మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని, అలాంటి పబ్లిసిటీ మేజిక్కులు ఈ సారి కుదరవని ఘంటాపథంగా తేల్చిచెప్తున్నారు. ప్రజల్లో ఉన్న స్పష్టత, వాళ్ల నిర్ణయాలను పరిశీలించిన తర్వాత డీటెయిల్డ్ సర్వేను ఇచ్చింది ఈ సిపిఎస్ సంస్థ. దాదాపుగా 121 నుంచీ 130 సీట్లలో వైకాపా ఘనవిజయం సాధించనుందని చెప్పింది. అలాగే 21 ఎంపీ స్థానాలు వైకాపా సొంతమని అభిప్రాయపడింది. నాయకుడిగా కూడా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకంటే యువ నాయకుడైన జగన్‌వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారని ఈ సంస్థ తేల్చి చెప్పింది. గతంలో చాలా ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కూడా ఈ సర్వే సంస్థ చెప్పిన ఫలితాలు వాస్తవాలు అయ్యాయి. అందుకే ఇప్పుడు ఈ సర్వే ఫలితాలు వైకాపా వర్గాల్లో ఆనందం పెంచుతుంటే టిడిపి నాయకులు, పచ్చ మీడియా జనాల్లో మాత్రం టెన్షన్ పెంచుతోంది. ఈ చివరి ఐదు రోజుల్లో జగన్ అధికారంలోకి వస్తే ఏదో అయిపోతుంది అని జనాలను భయపెట్టడానికి భారీ ప్రయత్నాలు చెయ్యాలన్న దిశగా పచ్చ బ్యాచ్ అంతా సరికొత్త వ్యూహాలు రచించేలా చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -