Wednesday, April 24, 2024
- Advertisement -

వైఎస్సారా మజాకా.. ఇంకా తలుచుకుంటున్న జనం…?

- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలకు గానూ ప్రజల ఆశీర్వాదాలు ఎప్పుడు అయన కు ఉంటాయి.. ఇప్పటికి రాజశేఖర్ రెడ్డి మీద అభిమానం తెలంగాణ లో ని ప్రజలు చుపిస్తున్నారంటే అయన చేసిన సేవ అలాంటిది.. ఉచిత విద్య దగ్గరినుంచి, అంబులెన్సు లు, ఆరోగ్య శ్రీ, ఉచిత విద్యుత్ వంటి అనేక పథకాలు ప్రజలకు ఎంత లబ్ది చేకూర్చాయి అందరికి తెలిసిందే.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలను ఉపయోగించుకుని బాగుపడ్డవారే..

అయితే ప్రపంచం మొత్తం వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకాన్ని ఇప్పటికీ కొనియాడుతుంది.. తాజాగా కోట్లాది మంది ప్రజల ప్రణాలను కాపాడిన ఈ పథకం దేశంలోనే ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలించిందని జాతీయ శాంపిల్స్ సర్వేలో తేలింది. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో తప్పించి దేశంలోని మరే ఇతర రాష్ట్రంలో కూడా ఉచిత బీమా పథకం ద్వారా లబ్దిపొందిన వారి సంఖ్య అత్యంత స్వల్పం అని తేలింది. దేశంలో 85.9 శాతం మంది గ్రామీణులకు ఎలాంటి బీమా వర్తించడంలేదని కానీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణులలో మాత్రం 76.1 శాతం అలాగే తెలంగాణ ప్రాంత గ్రామీణులలో 70.3 శాతం మందికి ఈ బీమా ద్వారా లబ్ది పొందుతున్నారని, ఇక పట్టణ ప్రాంతంలో చూసుకున్నా దేశంలో 80.9 శాతం మందికి ఉచిత బీమా పథకం లేదని , కానీ ఆంధ్రప్రదేశ్ లో పట్టణ ప్రాంత ప్రజలు 55.9 శాతం మంది, తెలంగాణ పట్టణ ప్రాంత ప్రజలు 37.3 శాతం మంది ఈ భీమా ద్వారా లబ్ది పొందుతున్నారని ఈ సర్వేలో వెల్లడైంది.

ఇటీవలే అసెంబ్లీ లో సైతం కేసీఆర్ వైఎస్సార్ పనితనాన్ని ప్రస్తావించి వైఎస్సార్ చేసిన సేవలని అసెంబ్లీ సాక్షి గా గుర్తు చేసుకున్నారు.. తంలో ప్రభుత్వం కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తించేలా చేసిన.. జగన్ ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుతో సంబంధం లేకుండా 5లక్షల లోపు వార్షిక ఆదాయం లేని ప్రతి ఒక్కరికి ఈ పథకం కింద లబ్దిదారులుగా ఎంపిక చేయడం, అలాగే జబ్బుల సంఖ్య 1059 నుండి 2వేలకు పెంచడం, బిల్లు వేయి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేలా చేయడంతో రాష్ట్రంలో 95% మంది ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చారు.  ఏదేమైనా తండ్రి బాటలో జగన్ నడుస్తుండడం రాష్ట్రానికి ఎంతో మేలు చేసేదే..

సీఎం జగన్ అనుకరిస్తూ స్కిట్.. ఫైర్ అయిన వైసీపీ ఫ్యాన్స్..!

జగన్ చంద్రబాబు చేసే తప్పు చేస్తున్నాడా.. అయితే కష్టమే..?

ఒక్క నిమిషానికి ముఖేష్ అంబానీ ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారో తెలుసా..?

లగ్జరీ కార్లను బహుమతులుగా ఇచ్చిన స్టార్ హీరోలు వీరే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -