Friday, March 29, 2024
- Advertisement -

హోదా, ప్యాకేజ్, జోన్ కాదు…. ఆ ఒక్కటీ చేయండి…. లేకపోతే జగన్‌దే అధికారం… మోడీతో బాబు

- Advertisement -

పచ్చ మీడియా, టిడిపి నేతల విషయం పక్కన పెడితే 2019లో జగన్ అధికారంలోకి రావడం ఖాయం అని మాత్రం చంద్రబాబు బలంగా నమ్ముతున్నాడు. ఆ భయంతోనే ప్రస్తుతం రాజకీయ అడుగులన్నీ వేస్తున్నాడు. జగన్‌ని అధికారంలోకి రాకుండా చేయాలంటే ఆ ఒక్క నిర్ణయం తీసుకోవాలని మోడీని బ్రతిమాలుతున్నాడు. అయితే మోడీ మాత్రం బాబు మాటలకు ససేమిరా అంటుండడంతో మోడీని ఇబ్బందిపెట్టేలా ఏదో ఒకటి చేయక తప్పని పరిస్థితి చంద్రబాబుది.

పార్లమెంట్‌లో టిడిపి ఎంపిల డ్రామా, పవన్ కళ్యాణ్‌ని రంగంలోకి దించి తన భజన బ్యాచ్ అయిన జేపిలాంటి వాళ్ళతో నడిపిస్తున్న షో……మోడీకి వ్యతిరేకంగా పచ్చ మీడియా రాతలు……బడ్జెట్ ప్రవేశ పెట్టిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న షో ఇదే. ఈ నాటకం అంతా ప్రజల కోసమే అని పచ్చ జనాలు కలరింగ్ ఇస్తున్నారు. మరి నిజంగా ప్రజల కోసమే అయితే నాలుగేళ్ళుగా ఎందుకు సైలెంట్‌గా ఉన్నట్టు? హోదా, ప్యాకేజ్, జోన్, రాజధాని నిధులులాంటివి ఇప్పటి విషయాలా? నాలుగేళ్ళుగా అన్యాయం చేస్తూనే ఉన్నారు. ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు ఎపి ప్రజలను మభ్యపెడుతూ మోడీని సమర్థించాడు. అసెంబ్లీ సాక్షిగా మోడీపై ప్రశంశల వర్షం కురిపించాడు. మోడీ బ్రహ్మాండంగా నిధులు ఇస్తున్నాడు……నేను అంతకంటే ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాను అని మూడున్నరేళ్ళుగా చెప్పుకుంటూ వచ్చిన చంద్రబాబులో సడన్‌గా ఇంత మార్పు ఎందుకు వచ్చినట్టు? మోడీ ఏం చేయలేదని టోన్ ఎందుకు మారుస్తున్నట్టు? ఒక వేళ బడ్జెట్‌లో అన్యాయంపైన అయితే కేబినెట్ మీటింగ్‌లో టిడిపి కేబినెట్ మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజులు ఎందుకు సైలెంట్‌గా ఉన్నట్టు? బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందే బడ్జెట్‌లో ఎపికి సున్నా అని తెలుసుకున్న చంద్రబాబు బడ్జెట్ ప్రవేశ పెట్టడం అయ్యేవరకూ ఎందుకు మౌనంగా ఉన్నట్టు?

ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సమాధానాలు దొరికేశాయి. బడ్జెట్‌లో అన్యాయంపై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చంద్రబాబు కూడా ఊహించని స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అదే టైంలో రీసెంట్‌గా మోడీని కలిసిన సందర్భంలోనూ, ఆ తర్వాత కూడా సీట్ల పెంపు గురించి మోడీని అర్థిస్తూ ఉన్నారు. అయితే మోడీ మాత్రం ససేమిరా అన్నాడు. సీట్లు పెంచకపోతే కచ్చితంగా జగన్‌దే గెలుపు అని పూర్తి నమ్మకంతో ఉన్న బాబు…..ఎలాగైనా సీట్ల పెంపు నిర్ణయం తీసుకోవాల్సిందే అని పట్టుబట్టారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌లాంటి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఎన్నో ప్రయోజనాల విషయంలో మోడీ ఏమీ చేయకపోయినా మోడీని సమర్థిస్తూ ఉన్నాం. మోడీతో సయోధ్య కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టుపెట్టినప్పటికీ తాము మళ్ళీ అధికారంలోకి రావడానికి అవసరమైన సీట్ల పెంపు నిర్ణయం తీసుకోమంటే ఎలా? ఈ విషయంలో తగ్గేదే లేదు అన్నది మోడీకి బాబు ఇచ్చిన అల్టిమేటం. ఇప్పుడు ఇవే విషయాలను బిజెపి నేత సోము వీర్రాజుతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా సాక్ష్యాలతో సహా నిరూపిస్తున్నారు.

మూడున్నరేళ్ళుగా హోదాతో, రైల్వేజోన్‌తో సహా అన్ని విషయాల్లోనూ మోడీ అన్యాయం చేసినప్పటికీ మోడీ భజన చేస్తూ గడిపేసిన చంద్రబాబు ఇప్పుడు సడన్‌గా మోడీ అన్యాయం చేశాడు అని షో చేయడం వెనకాల అసలు కారణం సీట్ల పెంపుకు మోడీ ఒప్పుకోకపోవడమే అనే విషయం 2014 తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలిస్తున్న ఎవరికైనా ఇట్టే అర్థమయ్యే విషయమే. కాదంటారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -