Thursday, April 25, 2024
- Advertisement -

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రోజూ వారి దిన‌చ‌ర్య‌లు..

- Advertisement -

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ప్ర‌స్తుతం ఏపీకీ కాబోయే సీఎం. ప‌ది సంవ‌త్స‌రాల జ‌గ‌న్ క‌ష్టానికి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు.ఇటీవ‌లె జ‌రిగిన ఎన్నిక‌ల్లో 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్ల‌తో అఖండ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. చెప్పాలంటె గ‌తంలో సీనియ‌ర్ ఎన్టీఆర్ ఎలా ప్ర‌భ‌జంన సృష్టించారో ఆ ఆరేంజ్‌లో జ‌గ‌న్ సునీమీని సృష్టించారు. అయితే ప‌ద‌విలో ఉన్నా లేక‌పోయినా త‌న సింప్లిసిటీని మాత్రం మార్చుకోరు. జ‌గ‌న్ రోజువారి దిన‌చ‌ర్య‌ల‌ను ప‌రిశీలిస్తే…

ఒక పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న చూడ‌టానికి సాదాసీదాగా ఉంటారు. జ‌నంలోకి వ‌చ్చిన‌ప్పుడు తెలుసు సాదా చొక్క ద‌రిస్తారు. అన్నా, వాట్ స‌ర్ అనే రెండూ జ‌గ‌న్ ఊత‌ప‌దాలు. ఆయ‌న్ను క‌ల‌సిన వాల్లు చిన్న‌వాల్లు అయితే పేరుతోనూ..పెద్ద వాళ్లు అయితే అన్నా అని ఎంతో గౌర‌వంగా పిలుస్తారు.

ఉద‌యం వ్యాయామంతో జ‌గ‌న్ దిన చ‌ర్య ప్రారంభం అవుతుంది. ఉద‌యం 4.30 గంట‌ల‌కే జిమ్‌లో వ్యాయామం మొద‌లు పెడ‌తారు. వ్యాయామం త‌రువాత ప‌త్రిక‌ల‌ను చ‌ద‌వ‌డం ఆ త‌ర్వాత 9.30 కి పార్టీకార్యాల‌యంలో సంద‌ర్శ‌కుల‌ను, పార్టీ నేత‌ల‌ను క‌లుస్తుంటారు.

మితంగా ఆహారం తీసుకోవ‌డం, ఎక్కువ‌గా బ్లాక్ టీ తాగుతారు. ఉద‌యం పండ్ల ర‌సంతో అల్పాహారం ముగిస్తారు. మ‌ధ్యాహ్నం ఒక‌టి లేదారెండు పుల్కాల‌తో భోజ‌నం ముగిస్తారు. పెరుగు ఎక్కువ‌గా తీసుకుంటారు. ఆదివారం కుటుంభ‌స‌భ్యుల‌తో ఎక్కువ గ‌డిపేందుకు ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తారు. అత్య‌వ‌స‌ర‌మైతె త‌ప్ప ఆరోజు ఎవ‌రినీ క‌ల‌వ‌రు, ఎలాంటి కార్య‌క్ర‌మాలు పెట్టుకోరు. ఇవి ఏపీసీఎం వైఎస్ జ‌గ‌న్ దిన‌చ‌ర్య‌లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -