Wednesday, April 24, 2024
- Advertisement -

నైట్ టైం లేటుగా భోంచేస్తున్నారా? అయితే మీ పని అంతే!

- Advertisement -

కొన్ని సమయంలో రాత్రిపూట రాత్రిపూట లేటుగా, హెవీగా తినడం వంటివి చేస్తుంటాం. రాత్రిపూట భోజనం లేటుగా తినడం శరీరానికి చాలా హానికరం. ఇలాంటి అలవాటు అలాగే కొనసాగితే.. మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.

రాత్రిపూట లేటుగా భోజనం చేసేవాళ్లు.. మధ్యాహ్నం తినే మోతాదు కంటే.. ఎక్కువగా తింటారని మెడికల్ సెంటర్ అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే రాత్రిపూట జీర్ణక్రియ నిదానంగా జరుగుతుంది. దీనివల్ల శరీరంలో ఫ్యాట్ పేరుకుంటుంది. దీనివల్ల బరువు పెరగడం, ఒబేసిటి వంటి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. అవేంటో చూద్దాం. లేట్ నైట్ డిన్నర్ ని అవైడ్ చేద్దాం..

* లేటుగా భోజనం చేయడం వల్ల … ఆహారం ఎక్కువగా తీసుకుంటాం. రాత్రిపూట శరీరంలో జీర్ణక్రియ ప్రాసెస్ నెమ్మదిగా ఉంటుంది. దీనివల్ల పొట్టలో ఫ్యాట్ చేరుకోవడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. దీనివల్ల ఒబేసిటీ రిస్క్ వస్తుంది.

* శరీరంలో ఫ్యాట్ కంటెంట్ పెరగడం, గుండె నుంచి ధమనులకు రక్త శుద్ధిలో సమస్యలు రావడం వంటి కారణాల వల్ల హై బ్లడ్ ప్రెజర్ కి దారితీస్తుంది.

* రాత్రిపూట లేటుగా భోజనం చేయడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలుంటాయి. రాత్రిపూట మెటబాలిజం నెమ్మదిగా ఉంటుంది. కార్బొహైడ్రేట్స్ ఎఫెక్టివ్ గా పగలగొట్టబడవు. దీనివల్ల షుగర్ లెవెల్స్ ఎక్కువై.. డయాబెటిస్ రిస్క్ ఉంటుంది.

* నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. ముఖ్యంగా రాత్రిపూట లేటుగా మాంసం, స్పైసీ ఫుడ్, డైరీ ప్రొడక్ట్స్ అయిన మిల్క్ షేక్, చాక్లెట్, కెఫీన్ వంటివి తీసుకుంటే.. నిద్రలో సమస్యలు ఏర్పడతాయి. నిద్ర సరిగా లేకపోతే.. అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది.

* రాత్రిపూట లేటుగా భోజనం చేయడం వల్ల నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. రోజంతా లేజీగా అనిపిస్తుంది. ఏ పని సరిగ్గా చేయలేకపోతారు. దీనివల్ల మానసిక ఒత్తిడి, అలసట ఏర్పడి.. డిప్రెషన్ కి దారితీస్తుంది.

Related

  1. త‌మ‌న్నా ఒక్క నైట్ రేటు ఎంతంటే?
  2. అడ్డంగా ప్లేటు ఫిరాయించిన అల్లూ అర్జున్
  3. ఎక్కువగా నిద్రపోవడం వల్ల వచ్చే సమస్యలు!
  4. మధ్యహ్నం నిద్ర ప్రాణానికే హాని!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -